• Dracula
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డ్రాక్యులా

    Dracula

    Pages: 200
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అరుంధతి చకచకా నడుస్తోంది.

కీచు కీచు మంటూ కీచురాళ్ళ సవ్వడి.... నడుస్తూ నడుస్తూ టక్కున ఆగిపోయింది.

మామిడి తోపులోనే ఉందొక ఊడలమర్రి.... ఆకాశానికి అంటేలా పెరిగి ఉంటుంది. అక్కడ నుంచి దాని ఊడలు భూమిని తాకుతూ లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి.

భూమిలో దిగిపోయిన ఊడలు భూమిని చీల్చుకుని లేస్తున్నాయి. అరుంధాతి ఆగింది. ఊడల కదలికలు ఆగిపోయాయి.

అరుంధతి మర్రిచెట్టును చూసింది.... చీకటి తెరని కప్పుకుని గంభీరంగా నిలబడి ఉంది. కళ్ళు చిట్లించి చూసింది. నిశ్శబ్ధంగా స్థబ్ధంగా ఉంది.

'మరి ఇందాక ఊడలలా వికృతంగా కదిలాయే.... భూమిని చీల్చుకుని మరి..... తానే పొరపాటు పడి ఉంటుంది..... ధ్వజస్థంబంలా నిలబడి ఉంటే కదిలినట్లుగా కనిపించడటం ఏమిటి? అయినా కదిలిందే అనుకో దాంట్లో భయపడల్సిందేముంది. దాని ధర్మం ప్రకారం గాలికి వూగాయి. అయినా కదిలినవి ఊడలు కదా!

అవేమన్నా ఉక్కు స్థంబాలా కదలకుండా ఉండటానికి', తనని తానే చూసుకుని జాలిగా నవ్వి - ముందుకు అడుగువేసింది.

సరిగ్గా అప్పుడు శబ్దమయ్యింది..... డబ్బున ..... వందకిలోల వస్తువు వెనుక పడ్డట్టు..... ముందుకు వెళ్ళబొయ్యేదాల్లా దిగ్భ్రాంతిగా ఆగింది.

Preview download free pdf of this Telugu book is available at Dracula