• Dr Sarvepalli Radhakrishnan
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

    Dr Sarvepalli Radhakrishnan

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 77
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మనజాతి నిర్మాతలు" అనే శీర్షికతో విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు వెలువరిస్తున్న పుస్తకాలలో మూడవది "డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్‌". ఈ పుస్తకంలో మాజీ రాష్ట్రపతి, ఉత్తమ ఉపాధ్యాయుడు అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత విశేషాలను సంగ్రహంగా వివరించారు.

* * *

"...క్రమంగా గ్రంథాధ్యయనం చేసే కొద్దీ ఆయనలో అంతర్నేత్రాలు విప్పారుతున్నాయి. జ్ఞాన కుసుమాలు వికసిస్తున్నాయి. ఒక విజ్ఞాన పిపాసువు ఆయనలో రూపుదిద్దుకొన్నాడు. మనిషి జీవనం కేవలం తన కోసం కాదని అతని చుట్టూ ఒక సమాజం ఉన్నదని, ఆ సమాజంపట్ల అతనికి కొన్ని బాధ్యతలున్నాయని గ్రహించగలిగాడు. అందువలననే ఆయన అన్ని విధాలుగా సత్ప్రవర్తనను అలవరచుకొన్నాడు. చక్కగా మాట్లాగలగడమే కాదు, తనలో వికసిస్తున్న భావాలను వ్యక్తీకరించటానికి ఖచ్చితమైన, శక్తివంతమైన పదాలను కూడా ఉపయోగించగలిగిన నేర్పువచ్చింది. ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేసిన ఫలితంగా ఆయన మాట్లాడేటప్పుడు ఆకర్షణీయమైన వాక్య విన్యాస శైలి బలమైన అర్ధవ్యక్తీకరణ అలవాటైంది. ఉన్నత ఆదర్శాలు అలవాటైనందున ఎటువంటి దురభ్యాసాలు అలవాటు కాలేదు. ఆనాడు అనేకులు విద్యావంతులు 'ఫ్యాషన్‌' కోసమో, డాంబికం కోసమో పొగత్రాగటం, ఆల్కహాలు సేవించం మొదలైన దురలవాట్లు చేసుకొన్నా, అవి ఎలాంటివో కూడా ఆయన జీవితమంతా ఎరుగడు. ఎంత వయసొచ్చినా, ఎన్ని దేశాలు పర్యటించినా శుద్ధశాకాహారిగానే మిగిలిపోయాడాయన...."

Preview download free pdf of this Telugu book is available at Dr Sarvepalli Radhakrishnan