• Dr Na D Souzagari Kathalu
  • Ebook Hide Help
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డా: నా. డి'సోజగారి కథలు

    Dr Na D Souzagari Kathalu

    Pages: 294
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీ ముందున్న ఈ పుస్తకం నా నుంచి ప్రచురించబడిన పదకొండో అనువాద రచనగా ఉంది. డా:నా.డి'సోజగారు షిమోగా (శివమొగ్గ) జిల్లాలోని సాగరపట్టణంలో 06-06-1937న జన్మించారు. చదివింది ఇంటర్‌ వరకు. గడించింది అపార అనుభవం. టైపిస్ట్‌గా రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో చేరి తదుపరి పబ్లిక్‌ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రథమశ్రేణి గుమాస్తాగా ఉద్యోగ విరమణ చేశారు. చదివింది తక్కువైనా ఎన్నో విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డౌక్టరేట్లను పొందారు. వారు కథకుడిగా నవలా రచయితగా సాహిత్యకృషి చేసారు. వారి కథలు నాటకాలుగా, టి.వి. సీరియళ్ళగా, సినిమాలుగా మారినవి. వారి ఆరు కథలు చలనచిత్రాలుగా రూపొందించబడినవి. ముఖ్యంగా వారి నవల 'ద్వీప' సినిమాగా రూపుదాల్చి జాతీయ స్థాయిలో స్వర్ణకమలం పొందింది. మరెన్నో విభాగాలలో పురస్కారాల్ని పొందింది.

వారి కథలు హింది, ఇంగ్లీషు, మళయాళం, తుళు, కొంకణి భాషలలోకి అనువదించబడినవి. తెలుగులో వారి కథలు నానుంచి రావటం, నా సుకృతంగా భావిస్తున్నాను. వారు పొందిన పురస్కారాల్ని పట్టి రూపంలో పెట్టాలంటే మూడు పుటలు చాలవు. పురస్కారాలన్నీ వారిని వెతుకుతూ వచ్చినవి.

పురోగామి, తిరోగామి, మధ్యేగామిగా విభజించబడిన సాహిత్యలోకంలో వీరు మధ్యేగామిగా గుర్తుంచుకోబడి రచనలు చేశారు.

మడికేరి (2014)లో జరిగిన 80 అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనంలో అధ్యక్షుడిగా కార్యభారం మోసారు. క్రైస్తవకుటుంబంలో జన్మించిన వీరు తమ సమాజంలోని మంచి చెడులు మరియు తన జన్మస్థలం అయిన మలెనాడులోని గ్రామీణ పరిసరాలు, తమ పనిచేసిన పి.డబ్ల్యు.డిలోని నిగూఢ విషయాల్ని కథావస్తువుగా తీసుకొని సహజకథలు అన్నట్లుగా రచనలు కొనసాగించారు.

- శాఖమూరు రామగోపాల్

Preview download free pdf of this Telugu book is available at Dr Na D Souzagari Kathalu