-
-
డా. కె.బి. కృష్ణ రచనలు
Dr K B Krishna Rachanalu
Author: Ravela Sambasiva Rao
Publisher: Navachetana Publishing House
Pages: 331Language: Telugu
అనేక కారణాలవల్ల ఈ గ్రంథానికి నేను ఇలా ఈ పేరు పెట్టవలసి వచ్చింది. మరీ ముఖ్యంగా నేను శ్రద్ధ పెట్టదలచిన అంకం : "కులవ్యవస్థను వ్యతిరేకించిన ఉద్యమాల చరిత్ర”. దురదృష్టవశాత్తు నా వద్ద సిద్ధంగావున్న సమాచారాన్నంతా ఈ సిద్ధాంత వ్యాసంలో పొందు పరచలేకపోయాను.
• ఈ సిద్ధాంత వ్యాసాన్ని పొందికైనదిగా చేసేందుకు విషయాన్నంతా ఇలా వాడుకోవటమే ఏకైక మార్గంగా నాకు కన్పించిందనేది మొదటి సంగతి.
• ఆధిపత్య పోరులో బ్రాహ్మణ బౌద్ధ సిద్ధాంతాలు ఒకవైపు తలపడుతూనే ప్రక్క ప్రక్కనే నిలదొక్కుకున్న తీరును ఇది బహిర్గతం చేస్తుంది.
• ఆ కాలంనాటి పలు విధాలైన చలనశీలతల్ని పట్టి చూపుతుంది.
• ఈ సిద్ధాంత వ్యాసం స్వయం సంపూర్ణం. ఆ కాలంలో అప్పుడప్పుడే రూపుదిద్దుకొంటున్న కులవ్యవస్థపై వెలుగుల్ని ప్రసరింపజేస్తుంది.
• చివరగా నాకు అన్పించిందేమంటే మాతృకలనుండి సేకరించి ఉదహరించిన భాగాలను నేర్పుగా విశదీకరించేందుకు ఇదే ఏకైక మార్గమని.
- కె.బి.కృష్ణ
