-
-
డా.బి.ఆర్. అంబేద్కర్
Dr B R Ambedkar
Author: Dr. Malayasri
Publisher: Swathi Book House
Pages: 48Language: Telugu
బాబాసాహెబ్ డా. భీంరావ్ అంబేద్కర్ గొప్ప విద్యావంతుడు. మహా మేధావి. ప్రఖ్యాత న్యాయవాది. భారత రాజ్యాంగ నిర్మాత. బహుభాషావేత్త.
ఆయన జీవితమంతా సంఘర్షణలతో నిండి వుంది. విశ్రాంతి లేని పోరాటం సాగించిన సంఘ సంస్కర్త, కరుణాళువు. మానవతావాది. ఆయన దారిద్ర్యాన్ని ద్వేషించాడు. సమతను జన సంక్షేమాన్ని కోరుకున్నాడు. అందుకోసం ఆయన ఎన్నుకున్నది శాంతి మార్గం. ఆందోళన చేసి బాధితులు తమ హక్కులు సాధించుకోవాలి అని అన్నా-హింసను అంగీకరించలేదు. రక్తపాతాన్ని మెచ్చని కరుణామయుడు. కనుకనే తన చివరి దశలోనైనా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. భారత దేశాన్ని ఈ జాతిని ఆయన ప్రేమించాడు. కాని, హిందూమతంలోని వర్ణ వ్యవస్థను అంగీకరించలేక పోయాడు. పైగా అసహ్యించుకున్నాడు. ఒక అంటారని కులంలో పుట్టి అత్యున్నత విద్యార్జన గావించినా, ఉన్నత పదవులు చేపట్టినా తాము పుట్టిన కులం కారణంగా సమాజంలో ఎదురయిన అవమానాలను గుండెలో దాచుకున్నాడు. తనకేకాదు తనలాంటి లక్షల కోట్ల భారతీయులకు బాధా విముక్తి కావించాలని స్థిరనిర్ణయం తీసుకొన్నాడు.
Plz read