-
-
దూప
Doopa
Author: Ravi Verelly
Pages: 76Language: Telugu
"రవి ఏం చేస్తున్నాడో చూడండి. అమెరికాలో వొక 'ఆముదాలపల్లి'ని కట్టుకుంటాడు. డాలర్ చూపులోంచి కాకుండా, "ఎవరో 'రీవైండ్' బటన్ నొక్కినట్లు/కండెకు చుట్టుకుపోయిన కలల" కంట్లోంచి బయటకి చూస్తాడు. అనుబంధాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసి, ప్రతి మనిషిలో ప్రతి మాటలో వాటి వూపిరి భాషని వెతుక్కుంటాడు. స్నేహమనేది చెలామణీ సరుకు కాదనీ, అది మనసు లోపలి దూప తీర్చే ప్రాణ ధార అని చెప్తాడు. ఈ మొత్తం వ్యవస్థ 'నేను' 'నువ్వు'ల మధ్య 'మన' వంతెన కావాలని ఎదురు చూస్తాడు"
- అఫ్సర్
* * *
"అనుభవిస్తే కానీ అర్థం కాని కల, జీవితం.
మైళ్ళకు మైళ్ళ పొడవుండి, దిగంతాలను తాకే కల,
కవిత్వం.
కవిత్వం నాకొక తీరని దూప. నన్ను నేను కనిపెట్టుకోవాలనే తపనే నా దూప. ఉన్నట్టుండి కోల్పోయి, మళ్ళీ నన్ను నేను పొందడానికి, కవిత్వపు చేంతాడుకు జ్ఞాపకాల బొక్కెన కట్టి అలా కాలంలోకి విసిరి ఆర్తిగా తోడుకుంటాను. ఒకడుగు ముందుకు వేసి, జారిన ఏదో జ్ఞాపకాన్ని పట్టుకోవాలని ఒకడుగు వెనక్కి వేసి, ఎప్పటికీ ఉన్న చోటే మేల్కొంటాను".
- రవి వీరెల్లి
మిత్రుడు రవి వీరెల్లి కవిత్వం Ravinder Verelly "దూప"కి ఈ ఏడాది సర్ సీపీ బ్రౌన్ అవార్డు లభించింది. మొదటి కవిత్వ సంపుటితోనే ఈ అవార్డు గెల్చుకున్నందుకు రవి గారికి అభినందనలు
- Afsar on Facebook