-
-
దొంగ... దొంగ... దొంగ
Donga Donga Donga
Author: Madhubabu
Publisher: Madhu Priya Publications
Pages: 359Language: Telugu
“నేను ముందే చెప్పాను. నువ్వు వినిపించుకోలేదు” ఆగిపోయి, వెనక్కి పరిగెత్తటానికి రెడీ అవుతూ కంప్లైంట్ చేశాడు.
“ముందుగా నువ్వు వెళతావా? నన్ను వెళ్ళమంటావా?” అతని మాటలు వినబడనట్లు అడిగాడు షాడో.
పదికి పైగా ఉన్నాయి పోలీస్ వాహనాలు. వందమంది కానిస్టేబిల్స్... ఎనిమిది మంది ఇన్స్పెక్టర్స్...
తేడా అంటూ వస్తే? ఆపైన ఊహించటానికి మనసు అంగీకరించక పోవటంతో, అసహ్యంగా మొఖంపెట్టి ఒక్కసారి తల విదిలించాడు గంగారాం.
పట్టుగుడ్డ మూట నిండా ఉన్నాయి చాంద్పూర్లో కొల్లగొట్టుకు వచ్చిన నగలు, తాకట్టు దస్తావేజులు... డబ్బు కట్టలు... మూటని చూపించమని వాళ్ళు అడిగిన మరుక్షణం బట్టబయలు అయిపోతుంది గుట్టు.
“ఏంటి ఆలోచిస్తున్నావ్? నన్ను వెళ్ళమంటావా?” మరోసారి షాడో హెచ్చరించడంతో ఎడతెగని ఆలోచనల్లోంచి బయటపడ్డాడు గంగారాం.
“ఎప్పటికప్పుడు నన్ను ఏదో ఒక ఇరకాటంలో పెట్టి తమాషా చూడడం నీకు బాగా అలవాటయిపోయింది. నిన్ను అని ప్రయోజనం లేదు... అసలు ఈ గొడవకంతా కారణం ఈ బిజువా పోలీసులు... వాళ్ళకి నషాళానికి అంటుకునేటట్టు ఇవ్వాలి ఒక కిక్కు” అంటూ చకచకా ముందుకు అడుగులు వేశాడు గంగారాం.
Hi, I'm trying to download this book and I'm getting always "This web page not available or operator not responding" . Can you please let me know the reason for this. Rented amount already deducted from my account.