-
-
డాలర్...! డాలర్...!
Dollar Dollar
Author: Simha Prasad
Publisher: Sri Sri Prachuranalu
Pages: 160Language: Telugu
ఆఫీసు నుంచి వస్తు ఓ అద్భుతమైన పెయింటింగ్ తెచ్చి ఇంట్లో అతికించాడు తండ్రి. ఒక పెద్ద భవనం, పోర్టికోలో ఏ.సి.కారు, మరో పక్క స్విమ్మింగ్ పూల్, బిల్డింగ్ చుట్టూ గార్డెన్, కాంపౌండ్ వాల్, గేటు పక్కన గూర్ఖా, పోస్టర్ పైన "దిస్ హెవెన్ ఈజ్ యువర్స్" అన్న కాప్షన్.
కొడుకుని పిలిచి ఆ పోస్టర్ చూపించాడు తండ్రి.
"బాబూ! ఈ స్వర్గం నీదేరా. నువ్వు తలచుకుంటే దాన్ని స్వంతం చేసుకోగలవు. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి, నీ గమ్యమేమిటో గుర్తు చెయ్యడానికి ఈ పోస్టర్ తెచ్చాను. భూమ్మీద అరుదైన అదృష్టవంతులలో నువ్వొకడివి కావాలి. అలా అవుతానని మాటివ్వరా" అని నిలేశాడు కొడుకుని.
అయోమయంగా చూస్తున్న ఆ కొడుకు అసంకల్పితంగా తండ్రి చేతిలో చెయ్యివేసి... అటుపైన ఏం చేశాడు?
జీవితంలో ధన సంపాదనే మనిషి ధ్యేయం కావాలనే.... ఆ వృద్ధుడు... చివరకు ఏం పొందాడు?
కన్నకొడుకు అభివృద్ధి కోసం కడుపు కట్టుకుని శ్రమించిన ఆ తండ్రి... జీవితంలో మర్చిపోయిన మాములు ధర్మాలు ఎలాంటివి?
తన ఉద్యోగరంగానికే తలమానికంగా ఎదిగిన ఆ కొడుకు.... తండ్రికిచ్చిన ప్రతిఫలం ఏమిటి?
ఆధునిక మానవుడు డబ్బు కోసం పెట్టే అందని పరుగులకు అక్షర రూపం... ఆలోచింపజేసే..... సింహప్రసాద్ నవల "డాలర్...! డాలర్...!".
