-
-
డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు
Doctor Vaasaa Prabhavathi Kathanikalu
Author: Dr. Vasa Prabhavati
Publisher: Sri Vedagiri Communications
Pages: 139Language: Telugu
డా॥ వాసా ప్రభావతిగారిది విలక్షణమైన వ్యక్తిత్వం. అందుకే ఆవిడ సాహిత్య సేద్యాన్ని చేస్తూనే, రచయిత్రులందరికీ సాహిత్యం పట్ల అభిరుచి పెరగడానికీ కృషి చేస్తున్నారు. చాలామంది రచయిత్రులకు తమ సంస్థ ద్వారా ఆవిడ ఆదర్శం.
అందుకే ఆవిడ కథానికల సంపుటాన్ని నాజన్మదిన సందర్భంలో తీసుకురావాలని నిర్ణయించుకోవడం జరిగింది. పదహారు కథానికలతో ఆ పదహారణాల ఆడబడుచుకి కానుక ఈ చిరుగ్రంథం.
''ఊరగాయజాడీ''తో ప్రారంభమై ఈ కథానికా సంపుటి 'నాకూ ఓ మనసుంది'తో ముగుస్తుంది. ఛాందస కుటుంబాల్ని మన కళ్ళ ముందుంచుతూనే, వాళ్ళలో విప్లవాత్మక భావాల్ని మెరిపించారు రచయిత్రి. 'కొత్తవెలుగు', 'అనసూయ లేచిపోయింది' లాంటి కథానికలు అందుకు నిదర్శనాలు. పెదాలమీద చిరునవ్వుని తాండవింపజేసే కథానికలు - 'ఊరగాయజాడీ', 'కామాక్షీ - కాసులపేరు' లాంటివి.
ఈ కథానికలు మీ అందరికీ ఆనందం కలిగిస్తాయని ఆశిస్తున్నాను. కేవలం ఆనందం కలిగించడమే కాదు, మెదడుకి మేతా పెడతాయన్న కథానికా లక్షణం కూడా ఈ కథానికల్లో మనకి కనిపిస్తుంది. చదవండి....మీకే తెలుస్తుంది.
- వేదగిరి రాంబాబు
