• Dixit Diary
  • fb
  • Share on Google+
  • Pin it!
 • దీక్షిత్ డైరీ

  Dixit Diary

  Publisher: P. Vijay Kishore

  Pages: 280
  Language: Telugu
  Rating
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  '4.43/5' From 7 votes.
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  '4.33/5' From 6 premium votes.
Description

బాబాను ప్రత్యక్షంగా సేవించుకున్న అత్యంత సన్నిహిత సాయి భక్తులలో శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ ఒకరు. బాబా ప్రత్యక్ష సన్నిధిలో తాము చూసిన మరియు పొందిన బాబా లీలలను, శిరిడీ సాయి సంస్థాన్ అధికారిక పత్రిక అయిన ‘సాయిలీల’లో 1923వ సంవత్సరం నుండి 1925వ సంవత్సరం వరకు మరాఠి భాషలో ధారావాహికంగా ప్రచురించారు. సుమారు 100 సంవత్సరాలకు పూర్వం బాబా ప్రత్యక్ష సన్నిధిలో జరిగి, ఇప్పటివరకు సాయి చరిత్ర గ్రంథాలలో వెలుగు చూడనటువంటి ఎన్నో అద్భుతమైన బాబా లీలలు, సాటిలేని అపూర్వమైన శ్రీ సాయి బోధనా పద్ధతి మరియు బాబా ముఖతః వెలువడిన అమూల్య వచనాలు కలిగిన ఆ ప్రచురణ ‘దీక్షిత్ డైరీ’గా సుప్రసిద్ధం. ఇంతవరకు సాయి భక్తులను ఏ భాషలో కూడా గ్రంథరూపంలో లభ్యం కాని ‘దీక్షిత్ డైరీ’ని శ్రీ సాయి అనుగ్రహ విశేషంగా తెలుగులోకి యధాతథంగా అనువదించి పాఠకులకు మొట్టమొదటిసారి గ్రంథరూపంలో అందించడమేగాక, అపూర్వమైన రీతిలో బాబాతో పెనవేసుకున్న శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సమగ్ర జీవన రచన ఈ గ్రంథంలో పొందుపరచడం విశేషం.

శ్రీ కాకాసాహెబ్‌ సంగ్రహణకంతటికీ ''దీక్షిత్‌ డైరీ'' అని పేరు పెట్టుకున్నట్లయితే, ఆ డైరీలో 1923 నుండి 1926 జులై మాసం వరకు సాయిలీలలలో ''మహారాజాంచే అనుభవ్‌'' ''బాబాంచే బోల్‌'' ''బాబాంచే బోధ్‌ పద్ధతి'' వంటి శీర్షికలతో ప్రచురితమైన సమాచారం అంతా వస్తుంది. ఆ కాలంలో శ్రీ కాకాసాహెబ్‌ పత్రికను తన వద్దనున్న సంగ్రహణతోనే నడిపారు. కాకాసాహెబ్‌ యొక్క సంగ్రహణ ఎంత గొప్పదంటే, ఒకవిధంగా బాబా చరిత్ర లేదా లీలలకు సంబంధించిన సమాచారం అంతా దాదాపుగా కాకాసాహెబ్‌ సంగ్రహణ నుండే బయటకు వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. అసంఖ్యాకమైన సాయి భక్తులకు నేడు నిత్యపారాయణ గ్రంథం అయిన ''సాయి సచ్ఛరిత్ర'' లోని చాలామటుకు లీలలు కాకాసాహెబ్‌ యొక్క సంగ్రహణ నుండి తీసుకోబడ్డవే! అంతేగాదు, ఖపర్ధే డైరీని సాయిలీలలో ప్రచురించడంలో, హేమాద్‌పంత్‌ సాయి సచ్ఛరిత్ర వ్రాయడంలో శ్రీ కాకాసాహెబ్‌దే ముఖ్యపాత్ర. సుమారుగా 1910వ సంవత్సరంనుండి బాబాకు సంబంధించిన వివరాలను తెలుపుతూ లేదా బాబా తమకు ప్రసాదించిన అనుభవాలను తెలుపుతూ ఎందరో భక్తులు వ్రాసిన ఉత్తరాలను ఆయన చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు. దానిని బట్టి ఆయన ఆ సంగ్రహణను ఎంత శ్రద్ధగా చేసారో అర్థం అవుతుంది. నాటి నుండి నేటి వరకు ఎందరో చరిత్రకారులు తమదైన శైలిలో అభివర్ణించిన ఎన్నో లీలల లేదా సంఘటనల మూలాలు మనకు కాకాసాహెబ్‌ సంగ్రహణలో దర్శనమిస్తాయి. అంటే సాయిచరిత్రకారులు భక్తజనావళికి అందించిన సాయిమహిమా పరిమళాలను వెదజల్లే సాయిసాహితీసౌగంధికపుష్పాలన్నీ కాకాసాహెబ్‌ సాగు చేసిన సాహిత్యోద్యానవనం నుండి సేకరించినవే!

Preview download free pdf of this Telugu book is available at Dixit Diary
Comment(s) ...

great effort to explore most of the important events in sri Dixit life. while reading, an experience of travelling with Baba along with Dixit is felt.This clearly indicates how the writer was in tune with Sai. The reading experience is a clear evidence of Baba!s grace on this book. Heartfelt grattitudes to the writer.

This book is a valuable addition to SAIBABA’S literature. This book gives us information about BABA'S leelas , and explains them analytically so that reader can experience the flavour of peerless power of Lord Sainath. Understandig BABA through a devotee's spiritual journey is a unique experience. who ever reads will definitely tastes the nectarine grace of Sree SaiBaba which is pouring abundantly while going through this book and leaves us in an unmatched ecstasy.
Author should be complimented for his efforts to make this work available to Telugu speaking people.

This is such an amazing opportunity to know more about baba and his lellas.

many unknown leelas of SAIBABA OF SHIRDI WHICH WERE PUBLISHED INTHIS BOOK

We have difficulty getting eBook through Kinige. Please make this book available in Flipkart or Amazon

అయ్యా చాలా చాలా ధన్యవాదములు నేను రామకృష్ణ విజయనగరం నుండి మన పుస్తకం చదవడం మొదలుపెట్టాను

Have been going through bits and pieces of the book and the depth of meaning is beyond my understanding but even partial reading brings in attention. I wish to read this thoroughly and thanks for writing such a grand book. This was possible only because of baba's grace!