-
-
దివ్యస్తోత్ర రత్నమాలిక
Divyastotra Ratnamaalika
Publisher: Nallan Chakravarthula Srinivasa Sarma
Pages: 492Language: Telugu
జీవితంలో విజయం సాధించిన వ్యక్తుల ఏడు అలవాట్లలో ఒకటి ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండడం. అది గుడి/చర్చికి వెళ్ళడమైనా కావచ్చు యోగాభ్యాసాలు చేయడమైనా కావచ్చు లేదా ఇంటి వద్దే పూజ చేయడమైనా కావచ్చు. హిందువులకు సూచించబడిన అత్యంత సరళమైన అధ్యాత్మిక మార్గం పూజ. ఇతర మతస్తుల వలె ఆదివారం లేదా శుక్రవారం నాడు మాత్రమే మందిరాలకు వెళ్ళక, హిందువులు పవిత్ర దినాలలోనే గుళ్ళకు వెడతారు. హిందువులకు ఇంటి వద్దే సలిపే నిత్య పూజ లేక సంధ్యావందనం లేక సూర్యనమస్కారాలు వంటివే దైవిక విధులు.
నిజమైన అధ్యాత్మిక గురువులతో సంబంధాలు కోల్పోయిన ప్రస్తుత తరానికి, తమ తమ హృదయాలలో వసించే పరమ గురువు వైపు మళ్ళడం తప్ప మరో మార్గం లేదు. అందుకు క్రమశిక్షణతో కూడిన సాధన అవసరం. ఐదు నిముషాలు, అంతకంటే ఎక్కువ, సమయం ఎంతైనా సాధన సక్రమంగా, నిర్దుష్టంగా చేయాలి. మీకు నచ్చే శ్లోకాలను పఠించండి. హృదయంలోని పరమ గురువు నిరంతరం మార్గదర్శనం చేస్తుంటాడని గుర్తుంచుకోండి. తెలుగువారు తమ నిత్య పూజని మరింత మెరుగుపరుచుకునేందుకు సుమారు 500 పేజీలలో 212 స్తోత్రాలతో కూడిన పుస్తకం ఇది. భక్తుల నుంచి అద్భుతమైన సమీక్షలు పొంది వేలాది కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం ఇది. పూజాసమయంలో తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాల్సిన పుస్తకం ఇది.
* * *
వివిధ దేవతామూర్తుల స్తోత్రాలను, శ్లోకాలను (సం)గ్రహించి, సేకరించి, ఒక చోటకి చేర్చే ప్రయత్నమే యీ పుస్తకము. ఇందులోని మొదటి భాగంలో నిత్య పూజావిధానము, రెండవ భాగంలో విశేష పర్వదిన పూజావిధానము పొందుపఱచబడింది. భక్తులకు, ముఖ్యంగా తెలుగునేలకి దూరంగా ఉన్నవారికి అనునిత్యమూ లేదా పండుగల వేళ పూజలకు యీ పుస్తకం తప్పక ఉపకరించగలదు.
* * *
ఏదైనా వస్తువు పోయినప్పుడు తిరిగి లభించుటకు చదవవలసిన స్తోత్రం:
కార్తవీర్యార్జునో నామ - రాజా బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ - గతం నష్టం చ లభ్యతే
సుమంతో సుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః
స్నానము చేయునపుడు పఠించవలసిన స్తోత్రం:
గంగేచ యమునే చైవ - గోదావరీస్సరస్వతి
నర్మదే సింధు కావేరి- జలేస్మిన్ సన్నిధంకురు
Ebook option thos paatu Print book option kooda vunte bagundedi
It's a nice attempt to bring all or most of the stotras together into one edition. But unfortunately, there're so many printing mistakes. It's not worth it. I don't recommend.