-
-
దివ్య సంపద (రామ్తా)
Divya Sampada Ramtha
Author: V V Ramana
Publisher: Akshara Publications
Pages: 239Language: Telugu
మీ యొక్క అజ్ఞానం వల్ల చిత్త చాంచల్యం సంభవిస్తూంది. జ్ఞానం మెండుగా వున్నప్పుడు మనస్సు స్థిరంగా వుంటుంది. ఎంతో నిజాయితీతో తెగింపుతో మీలోని దైవంకోసం వెదకండి. జీవితంలో సర్వోత్కృష్టమైన సాధన అదొక్కటే.
జ్ఞానం లేమితో కొట్టుమిట్టాడుతూ జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేక పెనుగులాడుతున్నారు. భయం నుండి, పిరికితనం నుండి, దుర్భర పరిస్థితుల నుండి బయటపడాలని పెనుగులాడుతున్నారు. మీలోని దైవాన్ని గుర్తించనందువల్లే ఇదంతా!
దైవత్వాన్ని గుర్తించనంతవరకూ మీ జీవితం కకావికలంగా అస్తవ్యస్తంగా, అసంతృప్తికరంగా వుంటుంది. వ్యర్థపు మాటలతో కాలయాపన చేస్తూంటారు. కాని జీవితం అంటే అది కాదు. యదార్థ జీవితం అంటే మీలోని దైవత్వాన్ని ఎరుకలోనికి తీసుకు వచ్చి ప్రతిక్షణాన్ని ఆనందంగా ఆస్వాదించమే.
ధర్మం వైపు, సత్యం వైపు నిలబడి జీవించినపుడు అది సంతృప్తికరమైన జీవితం అవుతుంది. నీలోని దైవాన్ని తెలుసుకున్నపుడే అది సాధ్యపుతుంది. బాహ్యంగా ఏది కలిగి వుంటున్నారనేది ముఖ్యం కాదు. మీ అంతర్ ప్రపంచంలో ఏది కలిగివుంటున్నారనేది ముఖ్యం!
It is not show the rent book
Sir plz send how to download