-
-
దింపుడు కళ్ళం
Dimpudu Kallam
Author: Ranganatha Ramachandra Rao
Language: Telugu
Description
ఈ అన్ని కథల్లోనూ రచయిత పాఠకుడిని తనవెంట నడిపిస్తాడు. ఈ కథల్లోని పాత్రలన్నీ జీవితంలో ఎక్కడో ఒక చోట మనకి తారసపడేవే. అందువల్ల కథల్లోని జీవితంతో మనం కూడా ఎంతో కొంత భాగం పంచుకుంటాము. రచయిత ఏ కథల్లోనూ పాఠకుడి నెత్తిమీద బలవంతంగా జీవితసత్యాలను రుద్దడు. కథల్లో ఆవిష్కృతమయ్యే జీవితమే, పాఠకుడికి జీవిత సత్యాలను బోధిస్తుంది!
ఈ సంపుటిలోని కథలన్నిటి వెనుక రచయిత కంఠస్వరం పాఠకుడిని వెన్నాడుతునే ఉంటుంది. పాఠకుడిని ఆధునిక భావజాలం వైపు నడిపిస్తూ, సంస్కార దృష్టిని ప్రేరేపిస్తూ మానవీయ మార్గంలో జీవితాన్ని సరిదిద్దుకోటానికి ఈ కథలు ఉపకరిస్తాయి. రచనకు ఇంతకు మించిన ప్రయోజనం ఏముంటుంది?
- సింగమనేని నారాయణ
Preview download free pdf of this Telugu book is available at Dimpudu Kallam
Login to add a comment
Subscribe to latest comments
