-
-
దిగంబర దేవతలు
Digambara Devatalu
Author: Sai Ramesh Gandham
Publisher: Self Published on Kinige
Pages: 221Language: Telugu
హుందాగా ముస్తాబై, విక్టర్ వేసిన పథకం ప్రకారం గేట్విక్ ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు రత్నకుమార్. త్రీ పీస్ బ్లాక్ సూట్, తెల్ల చొక్కా, నల్ల చుక్కలున్న ఎర్రని టై, మేచింగ్ కోసం కోటుకి ఎడం ప్రక్క పై భాగంలో గ్రుచ్చి నిలబెట్టిన ఎర్ర గులాబీ మొగ్గ - చూడడానికి చిన్న తరహా జేమ్స్ బాండ్లా వున్నాడు కుమార్.
బయట చెప్పుకోదగ్గ ఎండ లేకపోయినా ఖరీదైన రేబన్ కూలింగ్ గ్లాసులు పెట్టుకుని హుందాగా బిజినెస్ క్లాస్ చెక్ ఇన్ డెస్క్ దగ్గరకి చేరుకున్నాడు.
ఓ దొరసాని గుమ్మ తల వంచుకుని తీరుబడిగా మోబైల్ ఫోన్ మీద కార్డ్ గేము ఆడుకుంటోంది ఇంకేమీ పనిలేదన్నట్టు.
“హాయ్ .. అయామ్ కుమార్ ..” అంటూ చేయిచాపాడు చనువుగా
చివాలున తలఎత్తి క్షణకాలం పరిశీలనగా క్రింద నుంచి మీద వరకూ చూసి తను ఎదురుచూస్తున్న మనిషి ఆతడే అన్న నమ్మకం కుదరగానే చేయి అందుకుని కరచాలనం చేసి “ఆయ్ నో .. హౌ డు యు డూ ..” అంటూ మాట కలిపింది ఆ స్వేతసుందరి “ఇంత ఆలస్యం చేశావేమిటి .. విక్టర్ ఫోన్ చేసి తొమ్మిదింటికల్లా నువ్వు ఇక్కడ వుంటావని చెప్పాడే ..” అంది నిశితంగా
“విక్టర్ సంగతి నా కంటే నీకే బాగా తెలిసి వుండాలి .. చూశావుగా ఏం చేశాడో .. నాతో సింపుల్ గా నీ దగ్గరకు వెళ్ళమన్నాడు .. నీకేమో నేను ఫలానా టైమ్ కి నీ ముందు వుంటానని చెప్పాడు .. ఏం చెప్పమంటావ్ .. ఘరానా మనుషుల తీరే అంత ..” అన్నాడు కుమార్ పరిహాసపూర్వకంగా నవ్వుతూ.
శృతి కలిపింది శాలీ జోన్స్ మరింత ముగ్ధంగా నవ్వుతూ
“ఇదిగో నీకు ఇవ్వమన్న కవరు ..”
“ఏముందో లోపల ..”
“బలేవాడివే .. నాకెలా తెలుస్తుంది? ఇవ్వమన్నది ఒకరు .. పుచ్చుకున్నది ఇంకొకరు .. నా పని అందజేయడం మాత్రమే ..” అంది ఎత్తిపొడుపుగా
“నీలాంటి అందాల భామ తలచుకోవాలే కాని ఇలాంటి విషయాలు తెలుసుకోటం ఎంతసేపు ..” మృదువుగా మాటకి మాట అప్పచెప్పాడు కుమార్.
“చూడు మిస్టర్ నాకు చెప్పిన పనేదో నేను చేస్తున్నాను నువ్వు అడ్డదిడ్డంగా వాదించి నన్ను దయచేసి విసిగించొద్దు .. అసలే ఇది పబ్లిక్ ప్లేసు ..” అంది శాలీ జోన్స్. బిజినెస్ కం ఫస్ట్ క్లాస్ చెక్ ఇన్ దగ్గర ఇంకెవరూ కస్టమర్లు లేకపోయినా ఎందుకో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవ్వుతూ
“ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్దాంతం ఎందుకు మిస్ .. ఏదో సర్దాకి అడిగానంతే కోపగించుకోక ..” చొరవ చేసి భుజం మీద చేయి వేసి సముదాయించాడు దొరసాని పిల్లని.
మారుమాట్లాడకుండా తనదగ్గరే వున్న టిక్కెట్ బయటకు తీసి చెక్ ఇన్ చేసి “మీకేమైనా సీట్ ప్రిఫరెన్స్ వుందా” అని అడిగింది.
“కాస్త వెనుకా ముందు కూర్చున్నంత మాత్రాన ఒకరి గాలి ఒకరికి సోకకుండా వుంటుందా స్వీట్ హార్ట్ .. నీకు నచ్చిన చోట కూర్చో పెట్టు .. ఎడ్జస్ట్ ఐపోతాను ..” చిలిపిగా సమాధానం చెప్పాడు కుమార్ చూపులతో చిన్నదాని అందాన్ని తనితీరా గ్రోలుతూ.
The novel,was interesting in the beginning but then lost steam. average