-
-
ధ్యానము ఆధ్యాత్మిక జీవనము
Dhyanamu Adhyatimika Jeevanamu
Author: Swami Yatiswarananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 808Language: Telugu
''ధీరుడవై సత్యాన్ని ఆవిష్కరించుకో!'' అని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు. ఆ ప్రక్రియకు అక్షరబద్ధ రూపమే ఈ 'ధ్యానము ఆధ్యాత్మిక జీవనము'.
మానవ జీవితానికి సర్వోన్నత లక్ష్యం లేదా గమ్యం భగవత్సాక్షాత్కారం లేదా ఆత్మ సాక్షాత్కారం అన్నది నిర్వివాదాంశం. ఆ లక్ష్య సాధనకు ఎంతటి త్యాగానికైనా, పరిశ్రమకైనా వెనుదీయని చిత్తశుద్ధిగల ఆధ్యాత్మిక సాధకులకు ఈ 'ధ్యానము ఆధ్యాత్మిక జీవనము' అన్ని విధాల ఒక చక్కని మార్గదర్శిగా ఒప్పారుతుంది. ఆంగ్లంలో బహుళ ప్రచారం పొందిన 'Meditation and Spiritual life’ అనే పుస్తకం అనుసృజనే ఈ 'ధ్యానము ఆధ్యాత్మిక జీవనము.'
ఇటీవలి కాలంలో భారతీయ ఆధ్యాత్మిక రంగాన్ని సుసంపన్నం చేసిన యోగం, ధ్యానం ఇత్యాదుల అనుషాసనాల పట్ల ఆసక్తి విశ్వవ్యాప్తమైందని ఘంటాపథంగా చెప్పవచ్చు. సంస్థాగత మతాలతో విరక్తి చెందిన, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక శాస్త్ర వాగ్దానాల మోజుల భ్రమవీడిన, భౌతికవాద సంస్కృతీ దుష్పరిణామాల తాకిడిచే విసిగి వేసారిన అసంఖ్యాక పాశ్చాత్యులు ఒక సరికొత్త వాస్తవికతతో కూడుకొన్న నిర్దేశాన్ని వెతుకుతున్నారు, కోరుకుంటున్నారు. ఈ సంస్కృతీపరమైన ఆవశ్యకతను తీర్చే నిమిత్తం భారతదేశంలోనూ, విదేశాల్లోనూ కోకొల్లలుగా
పుస్తకాలు, పత్రికలు వెలువడుతున్నాయి. కానీ వెలువడుతున్న ఈ పుస్తకాలన్నీ సప్రామాణికంగా ఉండడం లేదు. అంతేకాక ప్రాచ్య చింతానా ధోరణుల వైపు మొగ్గు చూపుతున్న వారందరూ నిజానికి ఆ పరమసత్యాన్ని ఆకాంక్షిస్తున్న వారూ కాదు. వారిలో అనేకులు తమ ఆలోచనలకు, చేతలకు అనుకూలంగా ఉండే మేధోపరమైన ఒక చట్టం(framework) కోసం అన్వేషిస్తున్న వారే! కానీ ఎప్పుడూ నిజంగా ఆధ్యాత్మిక పరిణతిని సంతరించుకోగోరే చిత్తశుద్ధిగల కొద్దిమంది సాధక బృందం ఉంటూనే ఉంటారు. ఆ కొద్దిమంది ఆధ్యాత్మిక ఆవశ్యకాల
నిమిత్తమే ఈ పుస్తకం రూపుదాల్చింది.
ఆధ్యాత్మిక జీవితం గడపగోరిన కొద్దిమంది భక్తులకు శిక్షణ నిమిత్తం స్వామి యతీశ్వరానంద చేసిన ఉపదేశాలు ఈ గ్రంథంలో పొందుపరచ బడ్డయి. ఎక్కడ రాజీపడని ధోరణిలో సాగిన ఈ ఉపదేశాలు మన పాఠకులలో కొందరికి ఎంతో దుస్సహంగానూ, ఆచరణలో ఎంతో కష్టంగానూ అనిపించవచ్చునేమో! భగవల్లాభమే లక్ష్యంగా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించే సాధకులకు ఈ ఉపదేశాలు ఎంతో ఫలప్రదంగా ఉంటాయనే నమ్మకంతో వాటిని పొందుపరిచాం. ఈ 'ధ్యానము ఆధ్యాత్మిక జీవనము' ఒక తాత్త్విక గ్రంథం కాదు; ఆధ్యాత్మిక శిఖరాగ్రాలను
అధిరోహించిన ఒక మహనీయుని జీవిత పర్యంత అనుభవాల, అనుభూతుల ప్రమాణ పత్రం ఈ గ్రంథం.
ఈ గ్రంథాన్ని ఆదర్శం, సాధన, అనుభూతి అనే మూడు విభాగాల క్రింద వర్గీకరించాం. ఆధ్యాత్మిక పయనానికి ఉద్యుక్తులయ్యే ముందు ఆత్మ యొక్క యాథార్థ్య నైజం, విశ్వం, భగవంతుడు - ఈ మూడింటి గురించి, వీటి మధ్య నెలకొన్న పరస్పర సంబంధం గురించిన సైద్ధాంతిక జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. ఆదర్శంగా వర్గీకృతమైన విభాగం సాధకుడికి ఈ ప్రక్రియలో దోహదం చేస్తుంది. సాధన అనే విభాగాన్ని రెండుగా విభజించాం. దీన్లో మొదటి భాగం తీవ్ర ప్రార్థన, ధ్యానమయ జీవితానికి అవసరమైన యోగ్యతల సన్నాహాల గురించి విశదపరుస్తుంది. రెండవ భాగం సాధకుని అభిరుచి, ఆధ్యాత్మిక పురోగతి దశ మేరకు సాధకుడు అభ్యసించవలసిన ఆధ్యాత్మిక అనుష్టానాల గూర్చి వివరిస్తుంది. మూడవ విభాగమైన అనుభూతిలో పట్టుదల, నిరంతర పరిశ్రమతో, ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించే సాధకుడు పొందనున్న అనుభూతుల అభివర్ణన చోటు చేసుకొన్నది. అంతేకాక అటువంటి అనుభూతుల ఫలితంగా తరచూ తలెత్తే మానసిక ప్రతిస్పందనల గూర్చిన వివరణ కూడ ఈ విభాగం తెలియజేస్తుంది.
అవాస్తవికత నుంచీ వాస్తవికతకు, అజ్ఞానాంధకారం నుండి జ్యోతి స్వరూపానికీ, మరణం నుంచి అమర స్థితికి చేరుకొనే దిశగా పయనించే అనేక ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో కొంత స్ఫూర్తి, మార్గదర్శకత్వం ఈ పుస్తకం అందించి దోహదపగలదని మేం ఆశిస్తున్నాం.
- ప్రకాశకులు
గమనిక: 'ధ్యానము ఆధ్యాత్మిక జీవనము' ఈ-బుక్ సైజు 8MB

- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108