-
-
ధీరసాగర మథనం
DheeraSagara Mathanam
Author: P. S. Narayana
Pages: 280Language: Telugu
Description
రైలు కూత రావణాసురిడి కేకలా వినిపించింది. ‘పడమట బండి వచ్చేస్తుంది’అనుకున్నాడు రామ్మూర్తి వాకిట్లో ఉన్న నులకమంచం మీద అటునుంచి ఇటుకు ఒకసారి పొర్లి. నులక వత్తుకుంటోంది. వంటిన చొక్కా గూడా లేక పోవటంతో తల క్రింద ఉండగా చుట్టి పెట్టుకున్న తువ్వాలను- లేచి విడదీసి మంచం మీద పరచి తల క్రింద చేయి పెట్టుకొని మళ్ళీ పడుకున్నాడు.
‘ఈ సంవత్సరం నాలుగు దుప్పట్లు కొన్నాడు- తన వరకూ వచ్చేటప్పటికి ఒక్కటి వుండి చావదు!’ విసుగ్గా మూలిగాడు.
-వసంత రావాలి!
ఈ సంబంధమైనా కుదురుతోందో లేదో?
‘దానికి ఇరవై అయిదేళ్ళు వచ్చినయి... ఓ ఇంటిదాన్ని చేస్తే రెండు మూడేళ్ల వరకూ తనకే దిగులూ లేదు.... వచ్చే నాలుగు జీతం రాళ్ళతో కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపేయవచ్చు... చిన్నదాని పెళ్ళికి ఆ రిటయిర్మెంటు బెనిఫిట్స్ ఏవో రానే వస్తయి!’.
Preview download free pdf of this Telugu book is available at DheeraSagara Mathanam
Login to add a comment
Subscribe to latest comments
