-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ధాతృప్రశ్నః అథవా వేదాన్తమణ్డనమ్ (free)
Dhatru Prasnah Athva Vedantamandanam - free
Author: Dr. Suram Srinivasulu
Publisher: Raavi Mohana Rao
Pages: 102Language: Telugu, Hindi
స్వతంత్రమైన ఆలోచనలతో కూడిన భారతీయ తత్త్వశాస్త్రాన్ని పరిశీలిస్తూ వ్రాసిన సంస్కృత శ్లోకాలు, వాటికి తెలుగులో తాత్పర్య, అనువాదాలు.
***
"నైషా తర్కేణ మతిరాపనేయా” అన్న ఉపనిషద్వచనాన్ని అందరం అంగీకరించాం. “యతో వాచో నివర్తన్తే ప్రాప్య మనసా సహ” అన్న మాటనూ శిరసావహించాం. ఆ అభిప్రాయాలన్నీ మహర్షుల నిరంతరాలోచనల ఫలితాలు. వారిమీద నున్న అపారభక్తితో వాటిని ఔదలదాల్చాం . ఆ విధంగా ఋషిఋణం తీర్చుకుంటున్నామని గర్వపడుతూ జీవిస్తున్నాం.
ప్రధానోపనిషత్తులుగా పరిగణింపబడుతున్న వన్నీ శంకర భగవత్పాదుల కాలానికన్నా ముందువే. అందుకే వారు ఆ పదింటికీ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అద్వైతమతాన్ని వాటిలో ప్రతిక్షేపిస్తూ. ఆ తర్వాత కొన్ని శతాబ్దాలకు రామానుజులు, మధ్వాచార్యులు విశిష్టాద్వైత, ద్వైతమతాలను ప్రతిపాదించారు. అది జరిగీ చాలా శతాబ్దాలు గడచి పోయాయి. ఆధునిక పండితులు వాటిని యథాతథంగా అనుసరించటమే తప్ప ఆలోచించటం కూడా దోషమే అన్న భావాలకు ప్రాణం పోశారు.
ఆలోచనలను ఆపటమంటే జ్ఞానప్రసారాన్ని ఆపివేయటమే అని కూడా అనిపించటం లేదు వీరికి. జ్ఞానపరిధి విస్తరించటమే మానవజాతి పురోగతి. దానికి మూలం ఆలోచన.
ఆ కోణంలో కొన్ని స్వతంత్రాలోచనలతో, కొన్ని నూతన సమన్వయాలతో, కొన్ని యథాతథ స్పష్టతలతో సాగిన ఈ వేదాన్తమణ్డనం క్రొత్తగా ఆలోచించటంలో ఏ మాత్రమైనా సఫలమై, ఒకరిద్దరినన్నా ప్రభావితం చేయగలిగతే మా ప్రయత్నం ఫలించినట్టే.
- సూరం శ్రీనివాసులు

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE