-
-
ధర్మం అంటే ఏమిటి?
Dharmam Ante Emiti
Author: R.V.R.Prasad
Publisher: Self Published on Kinige
Pages: 276Language: Telugu
"ధర్మో రక్షతి రక్షితః" అన్నారు పెద్దలు. నువ్వు ధర్మాన్ని కాపాడు. అది నిన్ను కాపాడుతుంది అని అర్థం. అసలు ధర్మమంటే ఏమిటి? దాన్ని మనమెలా కాపాడగలం? అది మనల్ని ఎలా కాపాడుతుంది? ఇలాంటి సందేహాలు కొందరికి కలగవచ్చు.
ధర్మాన్ని గురించి చాలా మంది పెద్దలు ఇదివరలో చాలా వివరణలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కాని ధర్మం కూడా భగవంతుడిలాగే అనంతమైనది. దాన్ని విశ్లేషిస్తూ వెళ్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ధర్మం గురించి నాక్కూడా కొన్ని ఆలోచనలు భగవత్ప్రేరణ వలన కలిగాయి. వాటిని ఇందులో పొందుపరుస్తున్నాను.
ఒక్క మాట! ఏ విషయమైనా నేను పట్టు పట్టి పరిశోధనా దృష్టితో అధ్యయనం చేయలేదు. మనలో చాలామంది సామాన్యుల లాగే బుద్ధి పుట్టినప్పుడు వార్తాపత్రికలనో, పుస్తకాలనో చదవడం, ఉపన్యాసాలు వినడం, నాకు తోచిన విధంగా ఆలోచించడం మినహా ప్రత్యేకత లేవీ నాకు లేవు. కానీ ఇటీవల మన దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ వుంటే మనం గమ్యం లేకుండా వెళ్తున్నామా? అనే సందేహం తరచూ రాసాగింది. ఈ సందేహం నాకే కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కలుగుతున్నది అనే అనుమానం కూడా కలుగుతోంది. ఈ సందర్భంగా గత ముప్ఫై సంవత్సరాలుగా నేను యధాలాపంగా విన్న విషయాలు, చదివిన విషయాలు, గమనించిన విషయాలు సమ్మేళనం చేసి నా ఆలోచనల్ని మీతో పంచుకోవాలనిపించి మీ ముందుంచుతున్నాను.
- ఆర్వీఆర్ ప్రసాద్
* * *
ISBN : 978-93-5212-075-8