-
-
ధర్మ సందేహాలు - ఆర్. ఎ. పద్మనాభరావు
Dharma Sandehalu R A Padmanabha Rao
Author: R. A. Padmanabha Rao
Publisher: Self Published on Kinige
Pages: 80Language: Telugu
1978 నవంబరులో నన్ను కడప నుండి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పని చేస్తున్న ఉషశ్రీ స్థానంలో బదలీ చేశారు. ఆయన ప్రతి ఆదివారం మ॥ 12.00 గం||లకు ధర్మ సందేహాలు కార్యక్రమంలో శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిచ్చేవారు. శిష్యుడు ఏ.బి. ఆనంద్. నేను ఆ కార్యక్రమాన్ని 1980 జూన్ వరకు అంటే సుమారు రెండేళ్లు నడిపాను. నాకు శిష్యుడు మల్లాది సూరిబాబు. పురాణాలకు సంబంధించిన అనేక సందేహాలకు సమాధానాలిచ్చాను. మొత్తం కార్యక్రమం 30 నిమిషాల లైవ్. అందులో 10 ని॥లు ప్రశ్నలకు సమాధానాలు. మరో 20 నిముషాలు హరివంశ ప్రవచనం.
ఆ విధంగా ధర్మ సందేహాలు నిర్వహించిన నాకు ఆరాధన మాసపత్రిక సంపాదక మిత్రులు యన్. రామకృష్ణారావు నాకు పని ఆగస్టు 2018లో కల్పించారు. అంతకు ముందు పది సంవత్సరాలు పౌరాణిక బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి సమర్థవంతంగా నిర్వహించారు. వారి అనారోగ్య కారణంగా ఆ బాధ్యత నాపై బడింది. దాదాపు 20 నెలల సందేహాల సమాహారమిది.
- డా. ఆర్. అనంతపద్మనాభరావు
