-
-
ధర్మ ధ్వజం
Dharma Dhwajam
Author: Vanam Jwala Narasimaha Rao
Publisher: Darshanam Magazine
Pages: 366Language: Telugu
ప్రపంచంలో ఎన్నో మతాలు పుట్టాయి. నశిస్తున్నాయి. ఆకాశాత్పతితంతోయా యధాగచ్ఛతి సాగరం అన్నట్లుగా ప్రపంచంలోని అన్ని ధర్మాలకు మూలమైనది, అతి ప్రాచీనమైనది, ఆర్హమనీషులతో ప్రతిపాదించబడినది మన ‘సనాతన ధర్మం’. అనాదిగా భారతదేశంలో ఆచరింపబడుతున్న సనాతన ధర్మంపట్ల ప్రపంచ మానవాళి ఆసక్తిని కనబరుస్తోంది. భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తమవుతున్న తరుణంలో ఇలాంటి పరిణామాన్ని చూసి ఓర్వలేక కొందరు ఎన్నో కుట్రలుపన్ని విద్వేషపూరిత ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని దెబ్బతీసి నైతికంగా భారతదేశాన్ని జయించాలని చూస్తున్న వారికి దేశంలోనే మరికొందరు తోడై మన ధర్మంపై కుట్రలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జాగరూకతతో దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాల్సిన మనం దిక్కులు చూస్తున్నాం. "మనకెందుకులే" అన్నట్లుగా మిన్నకుండిపోతున్నాం. దాంతో మనకు మనమే తీరని నష్టాన్ని చేసుకుని భావితరాలకు అన్యాయాన్ని చేసినవారమవుతున్నాం. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః "స్వీయధర్మానుష్ఠానంలో మరణం సంభవించినా సరే - పరధర్మం అతి భయంకరమైనది. అది అనుష్ఠింపతగనిది" అన్న గీతాచార్యుని వాక్యం మనకందరికీ శిరోధార్యం.
ఇక్కడే కటికచీకటిలో వెలుగుచుక్కలా ధర్మవిరోధమైన విషయాలపై ఒకగళం కలం కదుపుతోంది. పరజాతి బానిసలు రాసే దుష్టరాతలకు తీరైన సమాధానం ఇస్తోంది. ఎక్కడ ఎలాంటి ధర్మానికి హాని కలిగించే సంఘటన జరిగినా, దాని మూలాలను విశ్లేషిస్తూ తనదైన శైలిలో పాఠకులకు నిజానిజాలను తెలియజేస్తోంది. మహామహులు చేయాల్సిన పనిని ఒంటిచేత నడిపిస్తోంది. ఆ గళం పేరే "వనం జ్వాలా నరసింహారావు". ఒక నిర్భీక రచనా పటిమ నరసింహరావు గారిది.
ఆయా సమయాలు, సంఘటనలకు అనుగుణంగా ఇంతవరకు తెలుగు దినపత్రికలలో రాసిన వివిధ రకాలైన 52 వ్యాసాలను "ధర్మధ్వజం" పేరుతో ఈనాడు మీ ముందుకు తీసుకువస్తోంది... "దర్శనమ్" ఆధ్యాత్మిక మాసపత్రిక. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే ధ్వజం. ఈనాడు పరాయి మతాల మోజులో సనాతన ధర్మాన్ని నిందిస్తున్నవారిపట్ల ధర్మధ్వజమై వారి కురాతలకు సమాధానంగా నిలుస్తోంది. సనాతన ధర్మంపట్ల అనురక్తుల్ని చేస్తుంది.
- మరుమాముల వెంకటరమణశర్మ

- ₹324
- ₹324
- ₹194.4
- ₹324
- ₹538.92
- ₹480
- FREE
- ₹60
- ₹60
- ₹194.4
- ₹538.92
- ₹60