-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ధరిత్రీ విలాపం (free)
Dharitri Vilapam - free
Author: Dr. P. Vijayalakshmi Pandit
Publisher: R.C. Reddy Publications
Pages: 88Language: Telugu
‘ధరిత్రీ విలాపం' దీర్ఘ కవిత. పేరును బట్టే ఇందులో ప్రధాన వస్తువు ఏదో మనకు తెలుస్తోంది. దీర్ఘ కవితను కొన్ని ఖండికలుగా విభజిస్తూ వాటి వస్తువుననుసరించి వాటికి ఔచిత్యవంతంగా పేర్లు పెట్టారు కవయిత్రి, విజయలక్ష్మిగారు. ఇందులో వస్తువు గంభీరమైనది. ప్రధాన వస్తువుకు సంబంధించిన పలు పార్శ్వాలను వ్యక్తీకరించే ఖండికలను గుదిగుచ్చకంలో కవయిత్రి ఏకసూత్రతను సాధించారు. విస్తీర్ణత వల్ల మాత్రమే ఒక కవిత దీర్ఘ కవిత లేదా కావ్యం అనిపించుకోదు. అందులో భావవ్యాప్తి, అనుభూతి సాంద్రత, వస్త్వైక్యత ఆద్యంతం కనిపించాలి. అంతర్లీనంగా ఒక తాత్వికత ఉండాలి. కవి దృక్పథంలో స్పష్టత ఉండాలి. సామాజిక ప్రయోజనం ఉండాలి. సందేశం ఉండాలి. దీర్ఘకవిత నిర్మాణంలో కవి కంఠస్వరం ఆద్యంతమూ విస్తరించి ఉండాలి.
'ధరిత్రీ విలాపం'లో ఒక పర్యావరణ పరిరక్షణ గురించిన శాస్త్రీయమైన దృక్పధం ఉంది. మానవీయ స్పందన ఉంది. భిన్న ఖండాల్లో విస్తరించిన భావనలు ఈ లక్ష్యోన్ముఖంగా సాగుతున్నాయి. మానవుని మనుగడకు సంబంధించిన గంభీర చింతన అంతర్లీనంగా కావ్యం ఆద్యంతమూ పరచుకొనిపోయింది. వస్తుగతమైన స్పష్టత, రూపగతమైన సరళ్యం ఈ కావ్యంలో కనిపిస్తుంది. ఈ కావ్యంలో కవయిత్రి స్త్రీ సహజమైన, మార్దవమైన, ప్రేమమయమైన, వాత్సల్యపూరితమైన లాలనతో కూడిన కంఠస్వరం ధరిత్రి కంఠస్వరంగా పర్యావరణ పరిరక్షణ గురించి పాఠకున్ని జాగృతపరుస్తుంది. ఆలోచింప చేస్తుంది. ఆచరణకు పురికొల్పుతుంది. జీవితం మీద, ప్రకృతి మీద, మానవుని మనుగడ మీద ప్రేమానురాగాలను, బాధ్యతతో కూడిన కర్తవ్యానురక్తినీ కలగ జేసేందుకు ఈ క్యావంలో కవయిత్రి చేసిన ప్రయత్నం అభినందనీయమైంది. ఈ సుదీర్ఘ వచన కవిత సామాజిక స్పృహ ఉన్న పాఠకుల్ని ఆకట్టుకుంటుందన్నది నా విశ్వాసం.
- ఆచార్య కె.యస్. రమణ

- FREE
- FREE
- FREE
- FREE
- ₹60
- ₹60