-
-
ధన్యవాదాలు
Dhanyavadalu
Author: Ravuri Bharadwaja
Publisher: Padma Publications
Pages: 40Language: Telugu
రావురి భరద్వాజ గారి కవితానికలు "ధన్యవాదాలు".
* * *
"చాలా కాలంగా మిమ్మల్ని చూస్తున్నాను ఎప్పుడు చూసినా ఏదో వెతుకుతూనే కనబడుతారు. మీరేమయినా పోగొట్టుకున్నారా? ఆ పోగొట్టుకున్నది అమూల్యమైయిందా? ఆత్మీయమయిందా? పోనీ - వొక నూతనాంశాన్ని కనిపెడదామని అన్వేషిస్తున్నారా?" అన్నాను.
"అవేవీ కాదండీ! ప్రభువు కోసం వెదుకుతున్నాను" అన్నారు వారు.
ఓ క్షణం నిశ్శబ్దం. ఆ తరువాత చిన్న నవ్వు.
"నీలోనే ఉన్న నన్ను గుర్తించలేని స్థితిలో ఉన్న నీవు ఎక్కడ వెదికితే మాత్రం ఏ లాభం? సత్యంలో, సహనంలో, కారుణ్యంలో, పరోపకారంలో, ఓదార్పులో నేనుంటానని నీకు తెలీదా?" అన్నారు మరొకరు.
అసలు - తొలిసారిగా ప్రశ్నించిందెవరు? దానికి జవాబు చెప్పిందెవరు? ఆ ప్రత్యుత్తరం మీద వ్యాఖ్యానించిందెవరు?
* * *
మీ అవగాహన, మీ ఆత్మీయత, మీ సంస్కారం, మీ సౌమ్యత, మీ సానుభూతి; మీకు - అపారమైన విలువలను సంతరించి పెడతాయి.
వాటి ముందు - మీ సిరులు, సంపదలు, పదవులు, అధికారాలు మొదలైనవి ఎందుకూ పనికిరావు!
