-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ధనేకుల వెంకటేశ్వరరావు - సమగ్ర రచనా సంపుటి (free)
Dhanekula Venkateswara Rao Samagra Rachana Samputi - free
Author: Dhanekula Venkateswara Rao
Publisher: Kavi Sabha
Pages: 122Language: Telugu
ఇటునటు నటునిటు గన నొ క్కటిగానే కానిపించు 'కవిజీవిక' ఇ
ట్టటులై 'నవజీవన' పద మటులై 'మందారదామ' మటు కడుమృదువై!
ఏ కులదేవతల్ కనికరించిరో! సిగ్గులు విచ్చు మొగ్గలై
ఏ కులపాలికల్ పలుకరించిరొ! తేనెలు చిందు తమ్మిపూ
రేకుల వంటి కైతల 'బలే' అనిపించెను సాహితీ సప
త్మీకుల మా 'ధనేకుల' అనేకుల, భావుకచంచరీకులన్!
- కరుణశ్రీ
వేకువ వెలుగును చీకటి లోకమునకు జూపగల సులోచనశతముల్
మీ కవితలు రసగుళికలు; నాకవి నచ్చినవి చాల నవకవితిలకా!
- పి. బి. శ్రీనివాస్
నీ కీర్తిపతాకగ, నీ యీ 'కవిజీవిక' నలంకరించిన 'సీతా
కోకచిలుక' విశ్వకవన నాక వనమున విహరించు నవ్యకవీంద్రా!
- సుఖవాసి మల్లికార్జునరావు
త్రిస్రగతిలో గుంటూరు పట్టణం కోణాలన్నిటినీ అందంగా స్పృశించి చూపారు. గుంటూరును గుండెలో నిలుపుకునేట్టు చేసిన మీ కవనధారకు నా అభినందన.
- సి. నారాయణరెడ్డి
మీ చేతిలో - కాదు, వాక్కులో హయప్రచార రగడ కదను ద్రాక్కింది. గుంటూరుకు సంబంధించి అన్ని పార్శ్వాలనూ, అన్ని అంశాలనూ, నిర్భయంగా, నిర్మొహమాటంగా, నిర్మమంగా చిత్రించడం ఎంతో హృద్యంగా వుంది.
- కోవెల సంపత్కుమారాచార్య
నాణెమైన పలుకులతో, నవ్యమైన తలపులతో
నీవల్లిన “గుంటూరు" ను నే మెచ్చితి ధనేకులా !
- స్ఫూర్తిశ్రీ టి. భాస్కరరావు
ఏమయ్యా ! మాత్రాఛందస్సుల మహారాట్టూ! నీ గేయాలు చదివాను. చాలా బాగా వ్రాశావయ్యా ! అగ్రశ్రేణి గేయకవుల్లో నీవున్నావు !
- నాగభైరవ కోటేశ్వరరావు
ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే సూచించమంటున్నారా? మా బోంట్ల సూచనలన్నిటికీ అతీతంగానే ఉంది మీ కవనరచన. ఈ కల్యాణవేళ మిమ్మల్ని చూడడం నాకెంతో ఆనందంగా ఉంది.
- ఎస్.వి. భుజంగరాయశర్మ
