• Dhanamulam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 120
    180
    33.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధనమూలమ్

    Dhanamulam

    Pages: 125
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒకనాడు నందిని భర్తతోసహా వచ్చింది. అమెరికా నుంచి తిరిగిరాగానే తిన్నగా ఇక్కడికే వచ్చింది. తన ట్రైనింగ్ పూర్తి అయిందని తండ్రికి చెప్పాలన్న ఉత్సాహంతో వచ్చింది. వాళ్ళిద్దరూ కారు దిగటం సుందరమ్మ చూచింది. తండ్రిలేడన్న విషయం తెలిసి నందిని ఎంత బాధపడుతుందో ఆమెకు తెలుసు. లోపల ఉన్న మంజరికి వార్త అందించింది. ఆమెకూడా ఉత్సాహంగా బయటికి వచ్చింది. గెంతుకుంటూ వస్తున్న నందినిని చూచి అలాగే నిలబడిపోయింది. నందిని ఇంట్లో అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న మంజరిని కౌగిలించుకుంది. మంజరికూడా ఆమెను హృదయానికి హత్తుకున్నది. కౌగిలి విడిచి నందిని తల్లివంక చూచింది. ఆమెలో ఉత్సాహం కనపడలేదు. ముఖంలో మార్పుని ఆమె గమనించలేదు. మంజరికి దుఃఖం ముంచుకు వస్తున్నది. నందినికి ఎదురుగా దండలతో నిండిన తండ్రి పటం కనిపించింది. అవాక్కయింది. తిరిగి మంజరి ముఖం వైపు చూచింది. ఆమె కన్నీరు ఆగలేదు. విషయం అర్థమయింది..."అమ్మా!" అని మంజరిని వాటేసుకుని బావురుమన్నది. "ఏమయిందమ్మా! ఎందుకిలా అయింది? ఎప్పుడయింది? నాకేమీ చెప్పలేదేం?" ప్రశ్నల వర్షం కురిపించింది - కన్నీటి వర్షంతో పాటు. సుందరమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ నిలుచున్నది.
మంజరి దుఃఖాన్నిదిగమింగి నందినిని ఓదార్చింది.."అవునమ్మా, చెప్పలేదు. నీ చదువుకి భంగం కలగరాదని తండ్రిగారు చేసిన కట్టడి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవుగదా! నాబ్రతుకు గూడా మారిపోయింది. స్వర్గం నుంచి ఊడి క్రింద పడ్డాను. పోయినవాళ్ళతో పాటు పోలేముగదా! జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోయారు. నాన్నగారు లేరని నువ్వుకూడా నన్ను నిర్లక్ష్యం చెయ్యవుగదా?"
"అదేమిటమ్మా అలా అంటావు? నేను నీకు మాత్రం ఏమీకానా? బాధలో అంటున్నావుగాని నేను నీ కూతురునికానా? నీ బాధలో నాకు మాత్రం భాగం లేదా?"
"మనసుతో బ్రతుకుని దిద్దిన మనిషి వెళ్ళిపోయాడు. మోడుగా మిగిలాను. నీవే నాకు తోడు. ఆయన పేరు నిలబడటానికి నీవే కారణం కావాలి. ఆ ఒక్క బాధ్యత మిగిలిపోయింది..."
"అవునమ్మా! నాన్నగారి మనసుకి తగినట్లుగా, ఎప్పటికీ ఆయన గుర్తుండేలా మనం బ్రతకాలి...దిగులు పడికూర్చుంటే ఫలితమేముంటుంది? గతం మరచిపోయి ఆయన ఆదర్శానికి తగినట్లు నడచుకోవాలి..."
సుందరమ్మ అప్పటికి తేరుకుని కల్పించుకుంది "దూరప్రయాణం చేసి వచ్చావు. రాగానే ఈవార్త మరింత బాధపెట్టింది. రామ్మా స్నానం చేద్దువుగాని.." అని పిలిచింది.
తరువాత సావధానంగా జరిగిన విషయం మంజరి వివరించింది.
"మేము కూడా ఇక్కడికి బదిలీ చేయించుకుంటాము. నీకు దగ్గరగా ఉంటానమ్మా!" అన్నది నందిని.
"నాకూ అదే అనిపించింది...ప్రయత్నించు.." అన్నది మంజరి.

Preview download free pdf of this Telugu book is available at Dhanamulam