• Deyyala Dibba Vajrala Haram
  • fb
  • Share on Google+
  • Pin it!
 • దెయ్యాల దిబ్బ వజ్రాల హారం

  Deyyala Dibba Vajrala Haram

  Pages: 76
  Language: Telugu
  Rating
  3.80 Star Rating: Recommended
  3.80 Star Rating: Recommended
  3.80 Star Rating: Recommended
  3.80 Star Rating: Recommended
  3.80 Star Rating: Recommended
  '3.80/5' From 5 votes.
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  '1/5' From 1 premium votes.
Description

"మహారాజా! నా మాట నమ్మండి. ఆ హారం వైనమేమీ నాకు తెలియదు..." సౌమ్యంగా చెప్పాడు, దొంగగా ముద్ర వేయబడి నిండు కొలువుకు రావించబడిన ఆ యువకుడు.
"నీ పేరేమిటి ?"
"శశికాంతుడు ప్రభూ!"
"పేరుకు తగ్గ అందం వున్నది కానీ ఏమి ప్రయోజనం. దొంగతనం నేరం మీద నా ముందు నిలిచావు!" అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా చూస్తూ.
మౌనంగా చూస్తున్న శశికాంతుడు సమాధానం చెప్పలేదు. ఏం జరుగుతుందోనని ఆ విచారణా విధానాన్ని ఆతృతగా చూస్తున్నారు అక్కడ చేరిన ప్రజలు.
"ఉట్టిలోని గుట్టు బట్టబయలైన తర్వాత కూడా నువ్వు మౌనం వహించడంలో అర్థం లేదు."
శశికాంతుడు సౌమ్యతను వీడలేదు. " మహారాజా! ఆ హారం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆ పతకాన్ని మీ వేగుల సమక్షంలో చూడటం అదే మొదటిసారి!"
శశికాంతుడు దొంగా? నిర్దోషా?
శశికాంతుడు నిర్దోషి అయితే అసలు దొంగ ఎవరు?
పాఠకులను వాయు, మనోవేగాలతో
పరుగులు తీయించే
శశికాంతుడి సాహసయాత్ర
దెయ్యాల దిబ్బ వజ్రాల హారం
అడపా చిరంజీవి జానపద నవల !

Preview download free pdf of this Telugu book is available at Deyyala Dibba Vajrala Haram
Comment(s) ...

నేను సినిమా డైరెక్టర్ ని ..పేరు గాంధీ మనోహర్. అడపా చిరంజీవి గారు నవల ఏదైనా ఫిల్మ్ బుల్ గా వుంటాయి. ముఖ్యంగా ఈ దెయ్యాల దిబ్బ వజ్రాల హారం అయితే సినిమా గా నిర్మిస్తే మంచి ఎంటర్ టైన్మెంట్ గా వుంటుంది. నాకు జానపద సినిమా తీసే అవకాశం వస్తే చిరంజీవి గారి అన్ని నవలలని తీయాలని కోరికగావుంది.ఈ నవలలో వజ్రాల హారం మిస్సింగ్.. అది శశికాంతుడు దొంగలించక పోయినా అతడే దొంగలించినట్టు ఎవిడెన్స్ వుండడం అనేది రైటర్ చాలా చక్కగా రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ నవలలో పరకాయ ప్రవేశం నేర్చుకోవడం గురించి ఇందులో అడపా చిరంజీవి గారు చాలా బాగా చెప్పారు. ఎలా అన్నది చదివితే మీకే అర్థమౌతుంది. ఇంతకంటే ఎక్కు చెబితే కథలోని ట్విస్ట్ లు తెల్సిపోతాయి. అందుకే ఇంతడితో ముగిస్తున్నాను. చిరంజీవిగారు మీనుండి ఇలాంటి నవలలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను.

చిన్నప్పుడు చదివిన అనగనగా కథలు ...ఆ కథల్లోని సాహసాలు కత్తియుద్ధాలు మాయలు మంత్రాలూ చదువుతుంటే "పాతాళ భైరవిలో" తోటరాముడిలా సాహసం చేయాలనిపిస్తుంది.అడపా చిరంజీవి "దెయ్యాల దిబ్బ వజ్రాల హారం" నవల చదువుతుంటే సరిగ్గా అలాంటి ఫీలింగే కలుగుతుంది.
ముఖ్యంగా శశికాంతుడి సాహసాలు...మహారాజుతో చెప్పిన మాటలు ఉత్తేజభరితంగా వున్నాయి.మొదటిపేజీ నుంచి చివరిపేజీ వరకూ ఏకబిగిన చదివించే నవల.
నిర్భయంగా విలువైన హారాన్ని దొంగిలించలేదని చెప్పడం...తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం...అడుగడుగునా సాహసం...చదువరులను సమ్మోహనపరుస్తుంది.
టాప్ టెన్ లో నిలిచిన ఈ నవలను "జానపద నవలలను చదివే ప్రతీ ఒక్కరూ "ఇష్టపడుతారు....విజయార్కె www.manrobo.com

జానపద నవలా సాహిత్యాన్ని మరోసారి పాఠక ప్రపంచానికి పరిచయం చేస్తోన్న కినిగె ప్రయత్నం అభినందనీయం.అడపా చిరంజీవి గారి రవ్వలమేడ ,దెయ్యాల దిబ్బ వజ్రాల హారం.వజ్రాలదీవి నవలలు అలనాటి అద్భుతమైన స్వర్ణయుగాన్ని ముందుకు తీసుకువచ్చింది.
జానపద కథానాయకుడు మహారాజు ...చోరులు ..మాయలు మంత్రాలూ ....,వజ్రాలదీవిలో కథానాయకుడి సాహసాలు...ఖడ్గవిద్య విన్యాసాలు.రాబిన్ హుడ్ కథలను కాశీమజిలీ కథలను.అరేబియన్ నైట్స్ కథలను గుర్తుకు తెస్తున్నాయి.
ఒక్కసారి చదివితే ఈ నవలలు చదవకుండా వదిలిపెట్టరని నా నమ్మకం. ..విజయార్కె
www.manrobo.com