-
-
దేవునితో స్నేహం
Devunitho Sneham
Author: Kiran Kumari Mandela
Publisher: M. Mercy Prabhudas
Pages: 268Language: Telugu
ఇప్పుడే గొట్టలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును (మత్తయి 3:10) అని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. యేసుక్త్రీస్తు సువార్త ప్రకటించనారంభించినప్పుడు మొట్టమొదటగా చెప్పిన మాటలు పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పెను. తండ్రి యొక్క పరలోకరాజ్యము ఏ రీతిగా ఆయన మనకు సమీపముగా తీసికొనివచ్చెనో తెలుసా? తన సన్నిధిని పరిశుద్ధులుగానూ, నిర్దోషులుగాను నిలువబెట్టుటకు యేసుక్రీస్తు తనంతట తానే మన పాపముల నిమిత్తము మాంసయుక్తమైన తన దేహమందు మరణము పొంది ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలుగజేసి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తండ్రితో సమాధానపరచి ఆయన రాజ్యనివాసులుగా చేసెను. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడని చెప్పుచున్నాడు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? మీరు చెడుతనము మానుకుని మారు మనస్సు పొంది క్రీస్తు మనస్సు కలిగి జీవించుడి. ఎలాగనగా క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రియ స్నేహితులారా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అందుచేత దేవుడు ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాడు. కాబట్టి నిన్ను విడువక ప్రేమిస్తున్న దేవునితో స్నేహం చేయాలని కోరుతున్నావా? అయితే నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుటకు తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని కోరుచున్నాను
