• Devuni Puttu Purvottaralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దేవుని పుట్టుపూర్వోత్తరాలు

    Devuni Puttu Purvottaralu

    Author:

    Publisher: Vasavya Book House

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దైవం ఉనికిని నమ్మని వారు నాస్తికులు. దేవుడు సర్వంతర్యామిగా గాని, ఏ రూపంలోగాని లేరన్నది వారి వాదన. యుగయుగాలుగా మానవ శక్తులకు అతీతమైన శక్తి ఉందని నమ్మేనాటికే అటువంటి శక్తి లేదని నమ్మేవారూ ఉన్నారు. కార్యాకారణాలు తెలియడం వలన జ్ఞానం పెరుగుతుంది. అపోహలు, భయాలు తొలగిపోతాయి. కొత్త జ్ఞానం, కొత్త భయాలనూ కల్పించవచ్చు. మరింత జ్ఞానంతో ఈ కొత్త భయాలూ తొలగవచ్చు. తెలుసుకోవలసిన విషయాలు ఉన్నన్ని రోజులూ అందుకు సంబంధించిన భయాలూ, ఆందోళనలూ ఉంటాయి. ఆ భయాలను అధిగమించేందుకు 'దైవం' ఆసరా మానవులు తీసుకుంటారు. నాస్తికులు జ్ఞానాన్వేషణ ఆసరా తీసుకో మంటున్నారు. అందుకై గోరా నాస్తిక కేంద్రాన్ని స్థాపించి తన జీవితకాలం శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు ఎంతో కృషిచేసారు.

ఈనాడు ఒకవైపు శాస్త్రీయ జ్ఞానం పెరుగుతున్నా ఆజ్ఞానాన్ని నిజజీవితంలో అన్వయించుకోక పోవడం సర్వసాధారణంగా మారింది. ఉదాహరణకి సూర్యుడే ఒకనాడు 'శక్తి'కి మూలం. నీటి నుండి, గాలి నుండి, అణువుల నుండి, వ్యర్థాల నుండి, రకరకాల ఇతర పద్ధతులలో శక్తిని వెలికితీసి ఉపయోగించుకుంటున్నా ఈనాటికీ 'శక్తి' ప్రాధాన్యతలో సూర్యునిదే ప్రథమ స్థానం. 'శక్తి'నిచ్చే ఇతర పదార్థాలను కొలవం! సూర్యుడిని కొలుస్తాం!!

సూర్యుడు ఒక నక్షత్రమని గుర్తించాం. అయినా గ్రహణాలను పాటిస్తున్నాం. రాహుకేతువుల కథలను నమ్ముతున్నాం. గ్రహణాల పట్టువిడుపులు, స్నానాలు, పూజలూ పెరుగుతున్నాయి. సూడో సైన్స్ పెరుగుతున్నది. ఇది పరిశోధనలను, శాస్త్రీయ ఆలోచనలను వెనకపట్టు పట్టిస్తుంది. పూర్వం మునులకు దూరదృష్టి ఉండేదని మనం తపస్సు చేసుకునేందుకు అడవులకు పోవడం లేదు. చక్కగా మొబైల్ ఫోన్లు వాడుతున్నాం. టివిలు చూస్తున్నాం. స్కైప్ చేస్తున్నాం. అదే సమయంలో లెక్కలేనన్ని మూఢనమ్మకాలను పాటిస్తున్నాం. ప్రశ్నించడం లేదు. తరిగిపోవల్సిన నమ్మకాలు పెరుగుతున్నాయి. తొలగిపోవాల్సిన అపోహలు కొనసాగుతూనే ఉన్నాయి. సన్యాసులు చేసే గారడీలు, దైవత్వాలుగా చలామణీ అవుతూనే ఉన్నాయి. ప్రశ్నించే తత్వం, వ్యక్తిగతంగా ఆలోచించే తత్వం, పరీక్షించే తత్వం పెరగనిదే పెరిగిన జ్ఞానం వలన సమాజానికి మేలు జరగదని విశ్వసిస్తున్నాం.

- నాస్తిక కేంద్రం

Preview download free pdf of this Telugu book is available at Devuni Puttu Purvottaralu