-
-
దేవుడున్నాడా...?
Devudunnada
Author: Bondalapati
Publisher: Self Published on Kinige
Pages: 74Language: Telugu
“స్వామీ, మమ్మల్ని సృష్టించింది నువ్వే కదా.. అంటే, మేము చేసే చెడ్డ పనులకి నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా..?”
“నువ్వు నెమ్మదిగా ఆస్తికుడివై పోతున్నావనుకొంటా.. మీకు స్వేచ్ఛా సంకల్పం(free will) ఇచ్చాను కదా? దానిని పరిస్థితులకి అతీతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది కాదా?”
“అంటే, మంచితో పాటు చెడు చేసే స్వేచ్ఛ కూడా నువ్వే ఇచ్చావన్నమాట! అసలు మనిషి చెడు చేసే ఆస్కారం నువ్వు కలిగించకుండా ఉంటే పోయేది కదా..? ఆ.. అయినా, నువ్విచ్చిన స్వేచ్ఛా సంకల్పంలోని స్వేచ్ఛ నేతి బీరకాయ లోని నెయ్యి లాంటిదిలే స్వామీ, అవునూ, ఎప్పటినుంచో నువ్వు కనపడితే అడగాలనుకొంటాను స్వామీ. జనాలకి ఇంత బాధలను ఎందుకు పెడతావు. ప్రళయాలూ, ప్రమాదాలూ ఎందుకు సృష్టిస్తావు? నువ్వు చెడ్డవాడివా, మంచివాడివా?”
“నేను మాత్రం కావాలని చేస్తానా? మంచి చెడులు మానవ సమాజాలు సృష్టించినవి. అనిర్వచనీయుడనైన నాకు మీ మంచి చెడులను ఎందుకు వర్తింప చేస్తున్నారు?"
