-
-
దేవుడు వర్సెస్ మానవుడు
DevuduVsManavudu
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 358Language: Telugu
“మనకోసం ఎవరో వస్తున్నారు. మనం ఆగాలి. కారాపండి...” ఆమె స్వరంలో ఒక విధమైన శాసనం.
అప్రయత్నంగా అతని కాలు బ్రేక్ మీద పడింది. కారు పక్కకి తీసి ఆపాడు. శివానీ కిందకి దిగింది. రెండడుగులు ముందుకువేసి ఎడంవైపు చూస్తూ నిల్చుంది. ఆ పక్కనే కొండ, దట్టమయిన చెట్లు... అటవీ ప్రాంతం అది. క్రూరమృగాలు కూడా సంచరిస్తున్నాయక్కడ.
శివానీ వాలకం అర్థంకాలేదు మనోహర్ కి. తనూ దిగి ఆమె పక్కనే నిలుచున్నాడు. పదినిమిషాలు మౌనంగా గడిచాయి. ఒకటీ అరా వాహనాలు వెళుతున్నాయి.
తదేకంగా అటే చూస్తోంది శివానీ. కొండ, ఆకాశం కలుస్తున్నట్లు కనిపించిన దగ్గర నల్లటి, తెల్లటి పొగల మిశ్రమంగా ఏదో ఆకారాన్ని ఆక్రమిస్తోంది. అబ్బురంగా చూస్తోంది శివానీ, కొండమీది నుంచి అలా అలా తేలుతూ వస్తున్నదేంటో గమనించారిద్దరూ. వాన...
అవును వానే...!
మనోహర్ విస్మయంగా శివానీని చూశాడు.
అయితే శివానీ ఎవరివైపూ చూడటంలేదు. ఆమె చూపు అలా తేలుతూ వస్తున్న వాన మధ్యన వున్న కనీ కనిపించని ఆకారం మీద నిలిచి వుంది.
ఆఖరి నిముషంలో గమనించాడు మనోహర్.
శివానీ ఏం మాట్లాడలేదు. మౌనంగా వుంది.
రెండు నిముషాల్లో వాన చుట్టుముట్టింది. కొండదిగి వచ్చిన బ్రహ్మన్నా రాయణేశ్వర తీర్థులు సరాసరి శివానీ ముందుకి వచ్చి ఆగాడు. ఆ కళ్ళలోని తేజస్సుని తట్టుకోవటం ఆమెవల్ల కాలేదు. తల వాల్చేసింది.
”మీరెవరు?” కంగారుగా అన్నాడు మనోహర్.
”నేనెవరో ఆ కైలాసంలో వున్న శివానీకి తెలీదా?” నర్మగర్భంగా అన్నాడు బ్రహ్మన్నారాయణేశ్వర తీర్థులు.
విస్తుపోయింది శివానీ. ఇదే మొదలు తను ఈయన్నీ చూడటం. తన పేరెలా తెలిసిపోయింది...?!
chala bagundi...