-
-
దేవుడు పంపిన దెయ్యం
Devudu Pampina Deyyam
Author: Sairam Akundi
Publisher: Akundi Narayanamurthy Publishing
Pages: 104Language: Telugu
ఇది.. శ్రీ రామ్ గోపాల్ వర్మ కోసం రాసిన దెయ్యం కథ.
గత ఏడాది జూన్లో శ్రీ మారుతి తీసిన “ప్రేమ కథా చిత్రమ్” సిన్మాని చూస్తుండగా.. దెయ్యాన్ని కామెడీకి ఎంత చక్కగా ఈ డైరెక్టర్ వాడుకున్నారో కదా అనిపించింది. అలా అనుకున్నప్పుడే ఇంకోటనిపించింది, దెయ్యాన్ని మంచికోసం ఎందుకు వాడుకోకూడదూ? అని.
అప్పుడు మొదలైన ఆలోచనలో సమకాలీన విషయల ప్రభావం చేత ఈ కథాగమనంలో- దేవుడూ, దెయ్యమూ, తెలంగాణా, సీమాంధ్ర, చార్ధాం, మోడీ, త్రీడీ, ప్రేమ, నిర్భయ.. ఇలా ఇవన్నీ కథావస్తువు అంశాలుగా చోటు చేసుకున్నాయి.
తెలంగాణా యువకుడూ, సీమాంధ్ర యువతీ మధ్య పెనవేసుకున్న బంధం.. ఉద్యమాలూ, ఉద్యేగాలకు అతీతంగా నిష్కల్మషంగా విరిసిన ప్రేమను చిదిమిన రాక్షసులపై తెలంగాణా యువకుడు చేసిన 'ధర్మ పోరాటమే' ఈ కథా సారాంశం.
సమకాలీన అంశాలపై తప్పనిసరిగా స్పందించే శ్రీ ఆర్జీవి చేతిలో ఈ నవల మరింత చక్కని కథారూపాన్ని సంతరించుకోగలదనే ఉద్దేశ్యంతో ఆయన్ని కలిసే దారికోసం ప్రయత్నించి కనుక్కోలేకపోయాను. ఏ ఛానెల్ దొరక్క ఈ ఛానెల్ ఆశ్రయించానిలా.
- సాయిరాం ఆకుండి
