-
-
దేవుడికి సాయం - రివైజ్డ్
Devudiki Sayam Revised
Author: Kolluri Soma Sankar
Publisher: Self Published on Kinige
Pages: 105Language: Telugu
Description
ఈ 'దేవుడికి సాయం' సోమ శంకర్ స్వకపోలకల్పితమైన తెలుగు కథా సంపుటి. ఈ కథలన్నీ వివిధ తెలుగు పత్రికల్లో ప్రచురింపబడినవే.
కథానిక లోనికి సరాసరి ప్రవేశించటం శిల్పం లోని ఒక గొప్ప గుణ విశేషం. అలాంటి ఎత్తుగడ వలన చదువరికి కథని చదవాలనే ఉత్సాహం, ఉత్కంఠ కలుగుతాయి.
సోమ శంకర్ కథానికలు అన్నిటా క్లుప్తత ప్రాణశక్తిగా జ్వలిస్తోంది. ఈ గుణ విశేషం ఈ కథల్ని మరీ మరీ తేజోమయం చేస్తున్నాయి.
శైలి రసస్ఫురణంకి అనువైన రీతిలో కథలన్నిటా గోచరిస్తున్నది. చక్కటి చదివించే గుణం ఈ శైలి వలన సమకూరింది.
మనుషుల ఆనంద విషాదాల్ని ఆవిష్కరించటంలో, జీవన వాస్తవికతని వ్యాఖ్యానించటంలో - కథా శిల్పిగా తన ప్రత్యేకతనీ, ముద్రనీ నిరూపించుకున్నారు - సోమ శంకర్.
నిరాడంబరంగా కనిపిస్తూ, చక చకా చదివిస్తూ, గాఢమైన అనుభూతిని అందిస్తున్న మంచి కథానికల సంపుటి ఇది.
- విహారి
Preview download free pdf of this Telugu book is available at Devudiki Sayam Revised
సరళంగా సూటిగా సాగే శైలి
సరళంగా సూటిగా సాగే శైలి, సమకాలీనమూ వైవిధ్యభరితమూ అయిన ఇతివృత్తాలు... మంచి పుస్తకాలకోవలోకి చేరిపోయిన మరో పుస్తకం! రచయితకి అభినందనలు!
- వారణాసి నాగలక్ష్మి (సుప్రసిద్ధ రచయిత్రి)
మనల్ని మనమే చూసుకునే కథలు
మనం కాస్తంత మానవత్వమున్న మామూలు మనుషులం. ప్రతి చిన్నవిషయానికీ స్పందిస్తాం. సంతోషమైనా, విషాదమైనా, వినోదమైనా మనకి తెలిసిన నలుగురితో చెప్పుకోకుండా ఉండలేం. సరిగ్గా అటువంటి కథలే కొల్లూరి సోమ శంకర్ రాసిన ఈ కథలు. ఈ కథలు చదువుతున్నంతసేపూ మనలని మనమే చూసుకుంటున్నట్లుంటుంది.
- జి.ఎస్. లక్ష్మి (సుప్రసిద్ధ రచయిత్రి)
చక్కని కథలు
ఇన్నాళ్లూ మంచి అనువాద కధలను మనకు అందించిన కొల్లూరి సోమశంకర్ తెలుగులో రాసిన కధలు. అన్నీ ప్రముఖ పత్రికలలో వచ్చినవే. 100 పేజీల్లో 16 కధలు. బావున్నాయి. కొని చదవండి. నేను చదివేశాను.
పొత్తూరి విజయలక్ష్మి (సుప్రసిద్ధ రచయిత్రి)