-
-
దేవుడంటే ఇదన్నమాట
Devudante Idannamata
Author: Narisetti Innaiah
Publisher: Navodaya Book House
Pages: 52Language: Telugu
దేవుడు గొప్పేమీ కాదు అనే పేరిట వెలువడిన గ్రంథం పాశ్చాత్య దేశాలలో విపరీతంగా అమ్ముడుబోతున్నది. క్రిష్టఫర్ హిచెన్స్ రచనలలో యింతగా బహుళ వ్యాప్తి చెందిన రచన యిదే. హిచిన్స్ చాలా శక్తివంతమైన విమర్శకుడు. పత్రికా రచయితగా, టెలివిజన్ కార్యక్రమాల నిర్వాహకుడుగా పేరొందాడు. హిచిన్స్ ఏ రచన చేసినా, దానివెనుక తీవ్రపరిశోధన వుంటుంది. అనేక మూలగ్రంథాల ప్రస్తావన వుంటుంది. సులభంగా ఎదుర్కోవడానికి వీల్లోని వాదనా పటిమ కనిపిస్తుంది. ప్రపంచ పర్యటనలో సేకరించి పరిశోధించిన విషయం ఈ గ్రంథంలో చూడొచ్చు.
ప్రస్తుత గ్రంథం మతాల అవినీతిపై విరుచుకుపడిన విమర్శ అన్ని మతాలనూ సమానంగా పరిగణించిన నిశిత రచన.
మార్గాంతరాలు సూచించినప్పుడు మానవ విలువలు, నీతి స్పష్టంగా సూచించాడు. మనం ఆశ్చర్యపడే అనేక సంఘటనలు చూసి, విశ్లేషించి, సమన్వయీకరణ కనబరిచాడు. హిచిన్స్ భారతదేశం, శ్రీలంక పర్యటించాడు. వ్యక్తిగతంగా క్రిష్టఫర్ అనేక అనుభవాలు సంతరించుకున్నాడు. సనాతన మతాలను, విప్లవ పార్టీలను లోతుగా అనుభవించాడు. ఇప్పుడు మానవ విలువలలో మునిగి తేలుతున్నాడు.
క్రిష్టఫర్ హిచెన్స్ ను వాషింగ్టన్ లో సెప్టెంబరు 30, 2007న ఒక మహాసభలో కలిశాను. ఆయన రచన అనువదించి తెలుగులో ప్రచురించడానికి, శాస్త్రీయ పరిశీలనా కేంద్రం పక్షాన అనుమతి కోరాను. ఆయన అంగీకరించి వివరాలకు తన ప్రచురణకర్తకు రాయమన్నాడు. అలా రాయగా ఎలాంటి డబ్బు డిమాండ్ లేకుండా యిచ్చారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ పుస్తకానికి అలా అనుమతి యివ్వడం అరుదైన అవకాశం.
క్రిష్టఫర్ హిచిన్స్ రచన చాలా వేగంగా పరుగెడుతుంది. అంత వేగంగా ఆలోచింపచేస్తుంది. గూడుకట్టుకుపోయిన మూఢనమ్మకాలను వదిలించడానికి, మనుషుల్ని ఉత్తమ విలువలతో నడుచుకునేటట్లు చేయడానికి తోడ్పడుతుంది. అందుకే యీ అనువాదం తలపెట్టాను.
- నరిసెట్టి ఇన్నయ్య

- FREE
- FREE
- ₹162
- ₹129.6
- FREE
- ₹129.6