-
-
దేవిప్రియ సంపాదకీయాలు - "అధ్యక్షా మన్నించండి"
Devipriya Sampadakeeyalu Adhyaksha Manninchandi
Author: Devipriya
Publisher: Samatha Books
Pages: 275Language: Telugu
Description
సంపాదకీయాన్ని కుదిస్తే రన్నింగ్ కామెంటరీ, రన్నింగ్ కామెంటరీని విస్తరిస్తే సంపాదకీయం. దినపత్రిక పూర్తిస్థాయి సంపాదకుడిగా పనిచేసే అవకాశం దేవిప్రియకు చాలాకాలం దాకా రాలేదు. అందుకే రన్నింగ్ కామెంటరీ రీపంలో వివిధ దినపత్రికలలో లఘుసంపాదకీయాలను సృజించారు. ఈ రోజుల్లో సంపాదకులలో చాలామంది సంపాదకీయాలను స్వయంగా రాయడం లేదు. పత్రికల విస్తృతి పెరగడం, పర్యవేక్షణ బాధ్యతల బరువు పెరగడం కూడా ఇందుకు ఒక కారణం. కానీ హైదరాబాద్ మిర్రర్లో ప్రధాన సంపాదకుడిగా పని చేసిన దాదాపు సంవత్సరం (2007) పొడవునా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తూనే గురుసంపాదకీయాలనూ, లఘుసంపాదకీయాలనూ (రన్నింగ్ కామెంటరీ) దేవిప్రియ రాసుకున్నారు. ఆ పత్రికలో రాసిన గురుసంపాదకీయాల సంకలనమే ఈ విలువైన పుస్తకం.
- కె. రామచంద్రమూర్తి
Preview download free pdf of this Telugu book is available at Devipriya Sampadakeeyalu Adhyaksha Manninchandi
Login to add a comment
Subscribe to latest comments
