• Devils Dinner
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డెవిల్స్ డిన్నర్

    Devils Dinner

    Author:

    Pages: 116
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

లాకప్‌లో నుంచి అంత తేలికగా బయటపడతానని అనుకోలేదు మరూబీ.

పోలీసులు అంత తేలికగా తన కథను నమ్ముతారని అతనికి నమ్మకం లేదు. ఏ పనిచేసినా ఏదో ఒక కారణంతో చేస్తారు వాళ్ళు, తన మీద జాలిపడి వదిలేసినట్లు నటించారు ... తన వెనుకనే మారువేషాల్లో అనుసరిస్తూ వుంటారు.

అపుడే తెరుస్తున్న ఒక హోటల్‌లోకి పోయి టీ ఆర్డర్ యిచ్చాడు మరూబీ. తగిలినవి నాలుగు దెబ్బలే అయినా తగలవలసిన స్థానాల్లో తగిలాయి. బాధగా ముక్కును సవరించుకుంటూ వేడి వేడి టీ ని ఆత్రంగా గొంతులోకి వంపుకున్నాడు.

పావుగంటసేపు అక్కడే కాలక్షేపం చేసి మెల్లిగా బయటికి వచ్చాడు.

అంతవరకూ హోటల్‌కి సమీపంలో నిలబడిన ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా అడుగులు వేయటం ప్రారంభించారు.

రెండు క్షణాలు ఆగి గిరుక్కున ప్రక్కకు తిరిగాడు మరూబీ. పది అడుగులు కూడా వేయకముందే ఘాటుగా తగిలింది. అతనికి పోలీసు వాసన.

ఎటువంటి వేషంలో వున్నా సరే - పోలీసుల్ని గుర్తుపట్టటంలో మరూబీని మించిన మొనగాడు టైమర్ ఐలాండ్‌లో మరి ఎవ్వడూ లేడు.

ముందుకు పోవాల్సిన ఆ వ్యక్తులిద్దరూ హడావుడిగా వెనక్కు తిరిగి తనను అనుసరించటం చూసి క్రూరంగా నవ్వుకున్నాడు మరూబీ.

డాగ్స్ ! వీళ్ళని ఏమార్చటం ఎంతో పెద్ద పని కాదు. ఇప్పుడే ఆ పని చేస్తే .... పట్టణంలో వున్న పోలీసులందరూ తన కోసం గాలింపు ప్రారంభిస్తారు. వాళ్ళకు కూడా కొంచెం విసుగు పుట్టాలి. ఎందుకొచ్చిన బాధరా యిది ... అనుకోవాలి వాళ్ళు.

తల వంచుకొని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, ఒక మురికి పేటలోకి వెళ్ళాడు మరూబీ ... పేటకు ఒక చివరగా వున్న తన రేకుల గుడిశె తాళం తెరిచి లోపలికి పోయాడు.

ఆ గుడిశెకు వందగజాల దూరంలో వున్న చిన్న టీ బంక్‌లో బిచాణా వేశారు. అతన్ని అనుసరించి వచ్చిన వ్యక్తులు యిద్దరూ ... లోపలికి వెళ్ళిన మరూబీ ... సాయంత్రం నాలుగు గంటలకు బయటికి వచ్చాడు. సూటిగా హోటల్ దగ్గరికి వచ్చి, రెండు కప్పుల టీ త్రాగి సరాసరి తన గుడిశెలోకి పోయి తలుపులు వేసుకున్నాడు.

హోటల్లో కూర్చుని వున్న యిద్దరు వ్యక్తుల్లో ఒకతను లేచి ఆ గుడిశె చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చాడు. ఒకే ఒక ద్వారం వుంది దానికి. అది హోటల్ దగ్గరికి కనిపిస్తూనే వుంది. అక్కడికి ఎవరు వచ్చినా, అటునుంచి ఎవరుపోయినా ఖచ్చితంగా కనిపించి తీరుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Devils Dinner
Comment(s) ...

MADHU BABU gari Vibhinnamaina SYLI ni pattukovalani kondaru Rachayithalu chala prayathnam chesaru, kanee pattubadaledu. Anthe kaadu, Madhu Babu peruku daggaraga unna perlu kondaru pettukunnaru kooda! That is the Craze of MADHU BABU. His narration is quite different. Anduke, Madhu Babu is Number One Writer.
This is different NOVEL.

Excellent narration.
Speed of Action.
That is 'Madhu Babu' garu.
Shadow reflects Madhu Babu.
That is the Hero MADHU BABU.
This is very nice Nover.