-
-
దేవతా ఓ దేవతా!
Devata O Devata
Author: P. Chandra Sekhara Azad
Publisher: Janaki - Azad Prachuranalu
Pages: 106Language: Telugu
సాయంకాలం పూట ఆడుకుంటున్న పిల్లలకి ఒక్కసారిగా చల్లటిగాలి తగులుతుంది. ఏమిటాని చూస్తారు. ఆకాశంలోకి అప్పుడు మేఘాలు వచ్చి వుంటాయి. గాలి కూడా పెద్దగా వీస్తుంది. ఆ గాల్లోకి కాయితాలూ, దుమ్మూ లేస్తాయి. పిల్లలందరికీ ఆనందంగా వుంటుంది. కొంచెం సేపట్లో వానొస్తుందని తెలిసిపోతుంది. చల్లని వాన చినుకులు పడతాయని కేరింతలు కొడతారు. వాళ్ళ మీద వాన చినుకులు కురుస్తాయి. అప్పుడా పిల్లలంతా అల్లిబిల్లిగా ఆడుకుంటారు. ఆకాశంలో ఓ మూల ఇంద్రధనుస్సు వెలుస్తుంది. అటు తిరిగి చూస్తూ ఆనందిస్తారు.
సరిగ్గా అలాంటి ఇంద్రధనుస్సే - ఈ దేవతా ఓ దేవతా! రచన.
ఇది పిల్లల కోసం రాసిందే అయినా పెద్దలందరూ విధిగా చదవాల్సిన రచన ఈ కొత్త మిలీనియంలో ఈ నాతి పెద్దలు ఏమేమి పోగొట్టుకుంటున్నారో - ఎంత చిన్న చిన్న విషయాల్ని విస్మరించి గ్లోబలైజేషన్ గొడవలో వాటికి దూరం అవుతున్నారో అద్దంలో చూపించిన రచనిది.
ఈ నాడు మనకీ, మన పిల్లలకీ, పుస్తకాలు విరివిగానే పబ్లిష్ అవుతున్నాయి. కాని అవన్నీ చదువుల కోసమే - భవిష్యత్‌లో ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో మరే ప్రొఫెషనల్ కోర్సునో చదువుకోవటానికి ఉపయోగపడేవే!
నిజానికి బేసిక్‌గా మనిషికి కావల్సిన భావోద్రేకాలకీ, మంచి చెడులకీ, మంచి విలువలకీ దోహదం చేసే రచనలు మనకిప్పుడు చాలా అరుదుగా వస్తునాయి. అలాంటి వాటిల్లో - "దేవతా ఓ దేవతా!" ఒకటి.
పిల్లల్లో ఉండే ఉక్రోషాలకీ, సుఖదుఃఖాలకీ, కలలకీ, స్నేహాలకీ, జిజ్ఞాసకీ అద్దం పట్టే నవలిది!
ఈ కాలం పిల్లలందరూ విధిగా చదవాల్సిన నవలిది!
- చంద్ర (ప్రముఖ చిత్రకారుడు, కథకుడు)
