-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
దేవరశిల (free)
Devarasila - free
Author: Vempalli Gangadhar
Pages: 166Language: Telugu
రాత్రి కురిసిన వానకు ఏటి నిండా కొత్త నీళ్ళు వచ్చి చేరినట్లు, నెమలి వాగు వంక ఎగువ నుంచి పొంగి పొర్లుతూ తెల్లటి నురగతో నవ్వుతున్నట్లు, చెరువులో బుడుంగు బుడుంగుమంటూ మునిగే నల్లటి చెరువు కోళ్ళులా, ఆకుపచ్చని కలల మధ్య అందంగా విప్పారిన తెల్ల తామర పువ్వుల్లా, చెరువు కట్టమీది చీకి చెట్లలోని జీరంగుల సంగీతంలా, ఊడలు దిగిన ఊరి మర్రిమానులా, గాలికి వూగే రావి ఆకుల గలగల సవ్వడిలా, చిటారు కొమ్మల్లోని పక్షి పాడే పాటలా, పంట చేలపై నుంచి పయనిస్తున్న ఎర్రమూతి కొంగల గుంపులా, నాలుగేళ్ళ కరువు దాహాన్ని తనివి తీరా తీర్చిన స్వాతి చినుకుల వానలా... ఇలాంటి అనుభూతులన్నీ ఈ 'దేవరశిల'లో ఎన్నో వున్నాయి. వేంపల్లి గంగాధర్ కలానికి వున్న బలం అది. హృదయం తెరచి ఆహ్వానించగలిగితే, శ్రద్ధగా వినగలిగితే మీరూ ఆస్వాదించవచ్చు. ఈ కథలు కొత్తవి. శాశ్వతమైన హోదా కల్గినవి కూడా!
- కె. వెంకటేశ్వర రాజు
Good Book..