• Desabhakta Konda Venkatappaiah
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దేశభక్త కొండ వెంకటప్పయ్య

    Desabhakta Konda Venkatappaiah

    Publisher: S.R. Book Links

    Pages: 58
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘ఆంధ్రరత్న’ గోపాలకృష్ణయ్య, ‘ఆంధ్రకేసరి’ ప్రకాశం, గొల్లపూడి సీతారామ శాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం, చల్లా శేషగిరిరావు, ఎన్.వి.ఎల్. నరసింహారావు, ఆచార్యరంగా వంటి దేశమాత ముదుబిడ్డ లెందరో గుంటూరు జిల్లా నుండి ఆవిర్భవించారు.

వీరందరికీ తలమానికం కొండ వెంకటప్పయ్య పంతులుగారు. 1905లో వెంకటప్పయ్య కేవలం జిల్లా నాయకుడు. 1920 నాటికి ఆంధ్రజిల్లాలలో ప్రముఖ గాంధేయవాదిగా ఎదిగి 1923 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికై జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందాడు.

స్వాతంత్ర్యోద్యమం కాలంనాటి ఆంధ్రదేశ రాజకీయాలలో వెంకటప్పయ్య గారిది ప్రత్యేకస్థానం. గాంధీమహాత్ముడు దేశ రాజకీయాలలో ప్రవేశానికి పూర్వమే ఆంధ్రాభ్యుదయాన్ని మనసారా కాంక్షించి, తన పూర్తి సమయాన్ని అందుకోసం కేటాయించడానికి వీలుగా వేలుగడించే న్యాయవాద వృత్తిని ఇష్టపూర్వకంగా, స్వార్థరహితంగా వదలివేసిన త్యాగశీలి.

ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకుడు. కృష్ణా పత్రికను స్థాపించి తెల్లదొరలపై అక్షర శస్త్రాన్ని సంధించిన అక్షర సేనాని.

గాంధీ పిలుపు నందుకొని సహాయనిరాకరణోద్యమంలో పాల్గొని గుంటూరును కురుక్షేత్రంగా మార్చి, ప్రజలచే ‘దేశభక్త’ గా కీర్తించబడ్డ గాంధేయవాది.

శాసనోల్లంఘనంలో ఆంధ్రజిల్లాలలో మొదటి నియంతగా నియమించబడి కోస్తాంధ్ర జిల్లాలను ఉద్యమంలో ముందుండి నడిపించిన సత్యాగ్రాహి.

దేశ దాస్యవిముక్తి కోసం పోరాడి, తన ఆశయ సాఫల్యాన్ని కనులారాగాంచి రెండో స్వాతంత్ర్యదినోత్సవం వార్షికోత్సవ సందర్భాన తుదిశ్వాస విడిచిన త్యాగమూర్తి.

వీరి జీవిత చరిత్రను భావితరాల వారికి అందించాలనే చిరుప్రయత్నమే ఈ పొత్తం.

Preview download free pdf of this Telugu book is available at Desabhakta Konda Venkatappaiah