-
-
డెంటిస్ట్ అంకుల్
Dentist Uncle
Author: Dr.O.Nageswara Rao
Publisher: Dr. Rao's Oral Health Foundation
Pages: 96Language: Telugu
బాల్యంనుంచే మంచి అంశాలు వివరంగా చెబితే ఫలితం అమోఘంగా ఉంటుంది. ఎందుకంటే, బాల్యం అనుకరించే దశ, అధ్యయనం చేసే దిశగా కొనసాగుతుంది. ఈ వయసులో నేర్చుకునే ప్రతి అంశం, తెలుసుకునే ప్రతి విషయం తమ హృదయాలపై చిరకాల ముద్ర పడుతుంది. పెద్దవారికి ఎంత చెప్పినా వినరు, పంచుకోరు. కానీ బాలలకు చెబితే వారితో పాటు భావితరం బాగుపడుతుంది.అవసరమయితే వర్తమానంలో తమ పెద్దల్లో కూడ మార్పు తెచ్చే శక్తి బాలల్లో ఉంటుంది. అందుకే బాల సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.
ఈ అంశాన్ని గమనించి కేవలం వారిని ఉద్దేశించే డాక్టర్ ఓ. నాగేశ్వరరావు దంత సౌభాగ్యానికి సంబంధించిన అంశాలు వ్రాశారు. తమ దంతాలను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే అంశాలపై సవివరంగా, సమూలంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎవరిని ఉద్దేశించి ఆ పుస్తకం రాశారో వారికే నేరుగా చెబుతూ ఎన్నెన్నో మార్గదర్శకాలు ఇందులో సూచించారు. అంతేకాకుండా దంతాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పారు. ఇవన్నీ 'వార్త' దినపత్రికలో మొగ్గ ద్వారా 'డెంటిస్ట్ అంకుల్' అనే శీర్షిక ద్వారా ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. వాటిని పుస్తక రూపం ఇవ్వడం హర్షణీయం. అందుకే ఈ పుస్తకాన్ని పిల్లలే కాకుండా వారి అమ్మా, నాన్నలు కూడ విధిగా చదవాలి. ఇతరులతో చదివించాలి. తద్వారా మీ దంత సౌభాగ్యం పలువురికి ఉపయోగపడి, వారి కుటుంబాల్లో చిరునవ్వులు నింపాలని ఆకాంక్షిస్తూ....
- టి. వేదాంత సూరి
