-
-
దేవుడిచ్చిన వరాలు
Demudichina Varaalu
Author: Madireddy Sulochana
Publisher: Navodaya Publishers
Pages: 245Language: Telugu
మర్నాడే అతని ప్రయాణము, పెరట్లో వున్న మొక్కలు తను పెంచిన వాటిని. చేతుల వంక చూసుకున్నాడు. అరచేతులనిండ కాయలే. మూడు నాల్గు రోజుల నుండి వర్షం లేక వాడిపోయినట్టు కనిపించాయి. నీళ్లు తోడి పోస్తుంటే అవి తనకు వీడ్కోలు యిచ్చినట్టు బాధపడ్డాడు. ఆప్యాయంగా ఆకులను ముట్టుకున్నాడు. మల్లె, మందార, రోజా, కనకాంబరాలు; మరో దిక్కు నిమ్మ, జామ ఏపుగా పెరిగి కాపుపట్టేలా వున్నాయి. వాటివంక చూసి యింట్లోకి వచ్చాడు. యింటిముందు కుడిప్రక్కగా వున్న పశువులశాలలో ప్రవేశించాడు. ''అంబా'' అంటూ లేగలు తలెత్తాయి. వాటి తువ్వాయిని దువ్వాడు. ఈ రెండు సంవత్సరాల నుండి జీతగాళ్ళు రాక వాటి సంరక్షణ తనే చేస్తున్నాడు. రాత్రిపూట పాలు పితుకుతున్నాడు. ఇకమీదట ఎవరు చూస్తారో? ఛీ! చదువులేకుంటే మానే. ఇంటి దగ్గరే ఉండిపోదామనిపించింది వెంటనే అతనికి పట్టుదలా, రోషమూ పెరిగాయి. తల్లి, దండ్రుల ప్రేమకు నోచుకోకపోయినా 'దేవుడిచ్చిన వరాలు' దీక్ష, ఆసక్తి, శక్తి, మేధ ఉన్నాయి. వాటిని ఉపయోగించు కోవాలి. తను వ్యక్తిగా పరిగణింపబడలి. అతని కండరాలు బిగుసుకున్నాయి.
* * *
"వివరాలు చెప్పమని నేను అడగను లెండి. ఎవరో మీ హృదయమును చాలా గాయపరచి వుంటారు. అందరూ ఒకలాంటి వారే అనుకోవటము పొరపాటు" అన్నది.
"కావచ్చు. 'పాలతో మూతి కాల్చుకున్న పిల్లి, మజ్జిగను ఊది ఊది త్రాగిం'దనే సామెత ఉందిగా, నా జాగ్రత్తలో నేనుండాలి. అజాగ్రత్త వల్ల ఇప్పటికే నా జీవితము తిరగవలసిన మలుపు నుండి వక్రంగా తిరిగింది"
* * *
పాఠకులకు ఉత్కంఠ కలిగిస్తూ, చివరిదాకా ఆసక్తిగా చదివించే నవల ఇది.
One of the best novel from Madireddy Sulochana garu. I have read many times and my favorite novel as well. Must read.
Thanks,
Vishnu