జోరీ పక్షికొండ శిఖరం, మీద వాలగానే దాన్ని ఎదిరించటానికి సిద్దంగా వున్నాడు షాడో. దిక్కులు దద్దరిల్లేలా అటవికుల అర్తనాదాలు దాన్ని బెదర కట్టాయి. శిఖరం మీద వాలినట్టే వాలి, రివ్వున గాలిలోకి ఎగిరిందది. తన గోళ్ళ మధ్య వున్న మానవుణ్ని చూసి అటవికులు మరింత బిగ్గిరిగా అరవటంతో దానికి మతి పోయింది. ఎటు పోవాలో అర్థంకాక వారి తలలమీదే రౌండ్లుకొట్టటం ప్రారంభించింది.
క్షణక్షణానికి శృతిమించుతున్న అటవికుల అరుపులు విని ఖంగారుపడ్డాడు షాడో. జోరీపక్షి తనను వారి మధ్య పడేయటం అంటూ జరిగితే - పుట్టగతులు వుండవని అనుకుంటూ, డాగర్ని ఎత్తిదాని కాలి మీద బలంగా పొడిచాడు.
బాధగా అరచి ముక్కుతో షాడో తలమీద కొట్టటానికి ప్రయత్నించింది జోరీపక్షి. మరోపోటు పొడిచాడు షాడో, ఆ దెబ్బతో జోరీ పక్షికి తెలివి వచ్చింది. దూరమౌతున్న అటవికులను చూసి తెలికగా నిట్టూర్చాడు షాడో. జోరీ శిఖరం మీద వాలగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.