• Dattata Swikaramu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 99
    110
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దత్తత స్వీకారము

    Dattata Swikaramu

    Pages: 83
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కథా సంపుటి రచయిత్రి శ్రీమతి డా.పి.పద్మావతి శర్మ గారు ప్రముఖ రచయిత్రే కాకుండా సంపాదకురాలు, గాయని కూడా. వీరి కలం నుంచి జాలువారిన పది ఆణిముత్యాల్లాంటి కథల సమాహారమే ఈ కథల సంపుటి. అన్ని కథలు వేటికవే విభిన్నమైన కథాంశాలతో మిళితమై వుంటాయి.

మొదటి కథ ' దత్తత స్వీకారం' చాలా మంచి కథ. ఈ కథను చివరి వరకు నడిపించిన తీరులో రచయిత్రి నైపుణ్యం కనిపిస్తుంది. చక్కని శైలితో కథను ముగించిన విధానం చాలా బాగుంది. ఈ కథను చదువుతున్నపుడు కథకు దత్తత స్వీకారం అనే పేరెందుకు పెట్టారా అనే సందేహం కలగుతుంది. ఆఖరి పేజీలో వీడిన సస్పెన్స్ కథను ఉన్నత శిఖరాలకు తీసుకుపోతుంది.

రెండవ కథ 'దేవుళ్ళు' కథలో కరోనా కష్టకాలంలో పనిపాటలు లేక తినడానికి తిండి దొరక్క ఆకలితో అలమటించే అన్నార్తులకు తిండిపెట్టే సహృదయులను దేవుళ్ళతో పోల్చిచెప్పడం.

'గూడురిక్షా' ఆర్ధ్రత నిండిన కథ. గూడురిక్షాను సొంత ఇంటిగా మార్చుకునే దయనీయమైన పరిస్థితి.

ఈ కథా సంపుటిలో మరో కథ 'దుర్మార్గం'. ఈ కథలో రచయిత్రి దుర్మార్గులైన కన్నతండ్రులుంటే కూతుళ్ళ జీవితాలు ఏవిధంగా నాశనమవుతాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

మరో మంచి కథ ఆస్తి అమ్మాయి హక్కు. భార్య ద్వారా సంక్రమించే ఆస్తిని ఆశించే అల్లుళ్ళు తమ అత్తమామలను కూడా తన తల్లిదండ్రులతో సమానంగా చూడాలని ప్రభోదించే మంచి కథ.

'కోరిక' అనే కథలో తనకిష్టమైన తిండి తిననివ్వని నడమంత్రపు భార్యను వూరికి పంపి తన కోరిక తీర్చుకున్న భర్త కథను నవ్వు తెప్పించే విధంగా ముగించడం బాగుంది.

'స్వేచ్ఛాజీవి' కథ కొత్త తరహాలో వున్న కథ. లేక లేక పుట్టిన కొడుకు జ్ఞాన సముపార్జనకు దేశాటన చేయడం, కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి రావటం పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. కథ సాదాగా సాగిపోతుంది.

మరో కథ 'తపస్సు'. ఈ కథలో సుబ్బారావు కోరుకున్న విధంగా తపస్సు చేయడం, అనుకున్న ఫలితాన్ని సాధించడం, దానినో అందమైన కలగా ముగించడంలో రచయిత్రి కృతకృత్యులయ్యారనిపిస్తుంది.

'సస్పెన్స్' కథలో ముకుందరావు, మీనాక్షి మానసికంగా విడిపోవడం ఓ సస్పెన్స్ అయితే చివరకి కలవడం కూడా అదే సస్పెన్స్

- డా. పి. పద్మావతి శర్మ

Preview download free pdf of this Telugu book is available at Dattata Swikaramu