-
-
డార్క్ అవెన్యూ
Dark Avenue
Author: Tejarani Tirunagari
Publisher: Manrobo Publications
Pages: 101Language: Telugu
భయానికి మూఢనమ్మకానికి సైన్స్‌కు అందని నిగూఢ రహస్యాల మిస్టరీ హిస్టరీ ఏమిటి?
నగరానికి దూరంగా విసిరివేయబడినట్టు వున్న డార్క్ అవెన్యూలో ఏం జరుగుతుంది ?
జంగానియా
నగరానికి నూటముప్పై కిలోమీటర్ల దూరంలో వున్న ఒక ఆటవికప్రాంతం...అడవిమధ్యలో వున్న ఒక కుగ్రామం.... ఆటవిక ప్రాంతం వరకే బస్సు సౌకర్యం వుంది. అది దాటాక నడుచుకుంటూ వెళ్తారు ఆ అడవిలో వున్న జంగానియా జాతి ప్రజలు.
అక్కడ చిన్న చిన్న ఊళ్లు ఆ ఊళ్లలోని ప్రజలకు చాలామందికి కరెన్సీ నోట్లు ఎలా వుంటాయో తెలియదు. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు దళారులు వాళ్లకు చిల్లరనాణెలు ఇస్తారు.
పుట్టతేనె, కాయగూరలు పండిస్తారు. అక్కడ అరుదుగా రంగురాళ్లు దొరుకుతాయన్న ప్రచారం వుంది. వాటిని దళారులు వస్తుమారకంతో కొనుక్కుంటారన్న ప్రచారం కూడా వుంది.
ఈ ఊళ్లకు భిన్నంగా వుండే ప్రాంతం జంగానియా....హీత్రోచీ భాషలో జంగానియా అంటే ఆత్మలు ప్రేతాత్మలు తిరిగేచోటు అని అర్థం. చిన్నచిన్న ఊళ్లలో వుండే ఆటవికులు సైతం జంగానియా వైపు కన్నెత్తి చూడరు... దూరంగా విసిరిపారేసినట్టు ఉంటుంది. ఆ ఊళ్ళో ఉండేవి పాడుబడిన ఇల్లు.. మొండిగోడలు.... సమాధులు.. జంగానియాను చూడ్డానికి వచ్చిన వాళ్లలో చాలామంది ప్రమాదవశాత్తు చనిపోయారనే వార్త ప్రచారంలో వుంది. కానీ జంగానియాలో అడుగుపెట్టిన మరుక్షణమే అక్కడ తిరిగే ప్రేతాత్మలు చంపేశాయని చాలా మంది అంటారు.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా చేతబడులు మీద బ్లాక్ మేజిక్ మీద నమ్మకం వున్న వాళ్ళు ప్రతీ ఆదివారం అర్థరాత్రి జంగానియాకు వస్తారు.. ప్రాణాల మీద ఆశ వదులుకుని.
అక్కడ వున్నది మగవాళ్లే... చిన్న పిల్లాడు కూడా చేతబడి చేస్తాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటారు. జంగానియాలో వున్న అతి పెద్ద వయస్సున్న వాళ్లలో తీశ్మార్ ఒక్కడు. అతని వయసు తొంభై తొమ్మిదేళ్లు. అయినా అతని గొంతులో ఒకవిధమైన తీవ్రత.
అమెరికా లాంటి అణ్వాయుధ దేశంలోనూ చేతబడులున్నాయన్న నమ్మకం వున్నా రోజుల్లో ప్రజలు చేతబడులు మూఢంగా నమ్మడంలో వింతేముంది.
తీశ్మార్ వయసు తొంభైతొమ్మిది.. ఇంకా ఎక్కువే అంటారు కొందరు. పొడవాటిగడ్డం.. ఎప్పుడూ ఎర్రగా వుండే కళ్ళు... ఆ ప్రాంతంలో దొరికే ఆకుపసర్లతో తయారయ్యే ఒక ద్రవపదార్థమే అతని ఆహారం అంటారు.
అతను ఉదయమంతా కనిపించడు.... సూర్యాస్తమయం తర్వాత చీకట్లు కమ్ముకున్నాక మాత్రమే బయటకు వస్తాడని చెప్పుకుంటారు. జంగానియాలో మంత్రగాళ్ళు వెలుతురును చుస్తే శక్తులను కోల్పోతారని ఒక నమ్మకం
ఆర్థరాత్రి ...స్మశానంలో ఒక కాలుతున్న చితికి సమీపంలో కూచోని కాలుతోన్న శవం వైపు చూస్తూ...
తేజారాణి తిరునగరి
డార్క్ అవెన్యూ
హారర్ థ్రిల్లర్
సూపర్ ...తులసిదళం తరువాత మళ్ళీ అలాంటి టెంపోతో ఉత్కంఠ కలిగించిన నవల.తీశ్మార్ పాత్ర చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడించింది.ఇటీవల ఇలాంటి సంఘటనలు జరిగాయి.హారర్ ను ఇష్టపడేవాళ్ళకు బాగా నచ్చుతుంది.
యథార్థ సంఘటనల ప్రేరణతో రాసిన హారర్ థ్రిల్లర్ డార్క్ అవెన్యూ.
ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.
హైదరాబాద్ లో అప్పట్లో సంచలనం సృష్టించింది.
లాజిక్ తో ఫిక్షన్ కలిపి హారర్ ను ఆసక్తిగా చదివే మా లాంటి పాఠకులకు చక్కని కాలక్షేపం.
భయపడుతూనే భయపెడుతూ చదివించిన నవల.
నవల ముగింపులో కొసమెరుపు బావుంది.
నవల బోర్ కొట్టించకుండా చదివించింది
thrilling navala.reserch chesi rasinattu vundi.teeshmaar patra bayanni kaliginchelaa vundi.chalaklam taruvatha manchi horror navala chaduvutunnanu
chala samvatsarala kritam ramsey brothers horror cinemalu chusanu.mallee alanti manchi horror navala chadivanu.thank you
నవల చదువుతుంటే రచయిత సమాచారాన్ని ఎంతో శ్రమకోర్చి సేకరించి,నవలలో పొందుపర్చినట్టు తెలుస్తుంది.హారర్ నవల రాయడం కత్తిమీద సాము లాంటిదే.యథార్థసంఘటనలతో ఆసక్తిగా భయాన్ని నేపథ్యంగా తీసుకుని రాసిన డార్క్ అవెన్యూ చాల బావుంది.తీశ్మార్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.
ప్రతిక్షణం భయపెడుతూనే ఆసక్తిగా చదివించే లక్షణం వున్న నవల డార్క్ అవెన్యూ.క్లైమాక్స్ ట్విస్ట్ . రచయిత్రి టాలెంట్ ని తెలియజేసింది.
తీశ్మార్ పేరులోనే భయం కనిపించింది.ఇలాంటి సంఘటన ఒకటి హైద్రాబాద్ లో జరిగినట్టు గుర్తు.లాజిక్ హారర్,రెంటిని బాలన్స్ చేసిన ఈ నవల రాత్రుళ్ళు చదవకండి.
యథార్థముగా జరిగిన సంఘటనల ఆధారంగా రాసిన హారర్ నవల డార్క్ అవెన్యూ చాలా బావుంది. రాత్రివేళ చదవాలంటే భయం వేసింది.హారర్ నవలలని ఇష్టపడేవారికి బాగా నచ్చే నవల .హారర్ కు సంబంధించిన మరింత సమాచారం కూడా ఇస్తే ఇంకా బావుండేది.
తీశ్మార్ గురించి చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది.వయసు తొంభైతొమ్మిది. పొడవాటిగడ్డం.ఎప్పుడూ ఎర్రగా వుండే కళ్ళు.ఆ ప్రాంతంలో దొరికే ఆకుపసర్లతో తయారయ్యే ఒక ద్రవపదార్థమే అతని ఆహారం అంటారు.ఇలా తీశ్మార్ గురించి వర్ణిస్తుంటే అలా చదువుతో ఉండిపోయాం.
హీత్రోచీ భాష ,జంగానియా అంటే ఆత్మలు ప్రేతాత్మలు తిరిగేచోటు అని అర్థం.అని చెప్పడం, కొన్నిచోట్ల రీజనింగులు ఇవ్వడం లాజిక్ లు చెప్పడం,చాలా బావుంది మేడం.డార్క్ అవెన్యూ సినిమాగా వస్తే చూడాలని వుంది.
Regular story.. waste of money