-
-
డేంజరస్ గేమ్
Dangerous Game
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 288Language: Telugu
మధుబాబు థ్రిల్లర్ ‘డేంజరస్ గేమ్’ రెండు భాగాల సంపుటి ఇది. ఓ ఎస్సైన్మెంట్లో షాడోతో పాటు స్వయంగా కులకర్ణి గారు పాలుపంచుకున్న నవల ఇది.
* * *
మరింతగా ప్లేరప్ అయిపోయారు ఆ శబ్దాన్ని ఆలకించిన కులకర్ణి.
"ఏం చేయమంటారు వాళ్లని? వరసపెట్టి డిస్మిస్ చేసేయనా??" సిగార్ని వెలిగించుకునే ప్రయత్నాన్ని వాయిదా వేసుకుంటూ అడిగారు.
"రాజు బర్మా ఎందుకు వెళ్ళినట్లు? మనం అతన్ని బర్మా పంపే ప్రయత్నంలో వున్నట్లు ముందుగానే తెలిసిందా??"
"సిక్స్త్సెన్స్ వున్నది ఆ ఇడియట్‌కి... ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడినట్లు తను ట్రబుల్స్ వైపు ఆకర్షించబడుతూ వుంటాడు... నాకు తెలిస్తే పర్మిషన్ ఇవ్వననే భయంతో ఠాకూర్ రాంచంద్ పనిమీద తనంతట తనే బయలుదేరి వెళ్ళాడు..."
తన ఏజెంట్స్ ఎప్పుడు ఏం చేస్తూ వుంటారనే విషయం ఆయనకు తెలుస్తూనే వుంటందని, ఎలా తెలుస్తుందని ఒక్కోసారి సి.ఐ.బి. ఏజెంట్స్‌కి కూడా తెలియదని హోమ్ మినిస్టర్‌గారికి తెలుసు.
తెలిసికూడా తెలియనట్లే కామ్‌గా కూర్చుంటారాయన. అవసరం వచ్చినప్పుడు ఆ మాటను బయట పెట్టి దుమ్ము దులిపేస్తూ వుంటారు.
