ఇద్దరు షాడోకు రెండు వైపులా నిలబడ్డారు. చేతులు వెనక్కు విరిచి కట్టబడి వున్నాయి నిస్సహాయంగా. కులకర్ణి గారి మాటలు గుర్తుకు వచ్చాయి షాడోకు.
"షాడో మా ఏజెంట్లలో గట్టివాడు. తనని పట్టుకొని చిత్రహింసలు పెట్టే స్థితికి చేరుకోడెప్పుడూ అవసరమైతే పోరాడుతూనే ప్రాణాలు విడుస్తాడు."
ఇప్పుడు సరిగ్గా దానికి ఆపోజిట్ జరుగుతున్నది.
"ఒక్క నిముషం. నా మనస్సు మార్చుకున్నాను." అన్నాడు ప్లెజెంట్‌గా. అందరూ ఆత్రంగా చూశారు. షాడో తన తలను వుపయోగించాడు. బంధింపబడకుండా వున్ననది ఒక్కటే.
తన కుడికాలి దగ్గర వున్నవాణ్ణి చూశాడు మొదట. అందరికన్నా లావుగా వున్నాడా వ్యక్తి. కరెంటు తీగలు కలిసినప్పుడు వచ్చే మెరుపులా వేగంగా కదిలాడు షాడో. శరీరంలో వున్న నరాలన్నీ కలిసే చోట తలతో గుద్దాడు. మొదలు నరికిన చెట్టులా నేలకూలాడతను. అదే వూపులో పక్కకు తిరిగి ఎడమ వైపున వున్న మనిషి ముఖం మీద పొడిచాడు తలతో. పెద్దగా మూలుగుతూ షాడో కాలు కింద పడ్డాడు..
I am a big fan of Shadow and madhubabu and I don't think this book is written by Madhubabu. This is one if the worst books with no style or story that we usually see in shadow books. Just because a character is addressed with the name Shadow doesn't make it a real shadow book. It's pure waste of our time even offered for free