-
-
దాంపత్య జీవన సౌరభం
Dampatya Jeevana Sourabham
Author: R. A. Padmanabha Rao
Publisher: Self Published on Kinige
Pages: 96Language: Telugu
ఆదర్శ దాంపత్యమంటే లౌకిక సుఖానికీ, దుఃఖానికీ అతీతమైంది. కర్మవశాత్తు వచ్చిన కష్టాలకు మానవుడు లొంగిపోకుండా దాంపత్యమనే పరమ పవిత్రబంధాన్ని పదిలంగా కాపాడుకోవడం ముఖ్యం. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులకే బాధలు తప్పలేదు. పరమేశ్వరునికి పతీ వియోగం. సతి కోసం పతి తపస్సు చేయడం, శివునికోసం పార్వతి తపస్సు చేయడం విశేషం. అలానే శ్రీరామచంద్రునికే సీత ఎడబాటు తప్పలేదు. వనవాసకష్టాలను సతీపతులిద్దరూ ఎంచుకొన్నారు, పంచుకొన్నారు.
పాతివ్రత్యంతో దాంపత్య జీవనాన్ని సుఖమయం చేసుకోవడం, ఆదర్శమూర్తులుగా లోకానికి మార్గదర్శకులు కావడం అత్రి మహర్షి, అనసూయల విషయంలో మనం గమనిస్తాం.
కాని నేటి యువత చిన్న పొరపొచ్చాలతో కాపురాలలో అడ్డుగోడలు కట్టుకొంటున్నారు. ఏదో ఒక మిషతో దంపతులు విడిగా ఉంటున్నారు. లేదా విడిపోతున్నారు. సంసార నౌక సాఫీగా సాగడానికి ఇద్దరూ బాధ్యులే. ఒకరి మీద ఒకరికి కోపం రావచ్చు. పోట్లాడుకోవచ్చు. మాట్లాడుకోకపోవచ్చు. అయితే పూర్వం పెద్దల జోక్యంతో అది సమసిపోయి సుఖజీవనం సాగించేవారు. ఇప్పుడు వేగవంతమైన, విలాసవంతమైన జీవితం వచ్చింది. కంప్యూటర్ పరిచయాలతో కలుసుకొని త్వరగా పెళ్లి చేసుకున్నవారు, అంతే త్వరగా చిన్న తగాదాలతో విడిపోతున్నారు. సంసారాలు చెడిపోతున్నాయి.
ఈ ఆధునిక సామాజిక నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డా. రేవూరు అనంత పద్మనాభరావు దాంపత్య జీవన సౌరభం పేర వివిధ ఆదర్శదంపతుల జీవనరేఖల్ని సరళంగా చిత్రించారు.
ఈ గ్రంథంలో త్రిమూర్తులు, సీతారాములు, సత్యాకృష్ణులు, అహల్యాగౌతములు, నలదమయంతులు, సావిత్రీ సత్యవంతులు మొదలుగా నలభై మంది పురాణదంపతుల జీవనవిశేషాల విశ్లేషణ చేసి సరళమైనభాషలో పద్మనాభరావు పాఠకులకు అందించారు.
బహుపురాణపరిచయము, విశ్లేషణాసామర్థ్యముగల పద్మనాభరావు ఆయా దంపతులు ఎదుర్కొన్న క్లిష్ట సమస్యల్ని ఆధునిక యువతీయువకులకు సమన్వయం చేసి చెప్పడం ప్రశంసనీయం.
- కందుకూరు శివానందమూర్తి
