-
-
దళితులు - రాజ్యం
Dalitulu Rajyam
Author: Bojja Tarakam
Publisher: Hyderabad Book Trust
Pages: 86Language: Telugu
"రాజ్యం" గురించి అనేకమైన సిద్ధాంతాలు, నిర్వచనాలు ఉన్నాయి. దానిని వ్యక్తపరచడానికి, బోధపరచడానికి అనేకమైన గ్రంథాలు వెలువడ్డాయి. అలాగే "దళితుల"ను గుర్తించడానికి, వారి సామాజిక, ఆర్ధిక రాజకీయ అంశాలను వ్యక్తపరచడానికి కూడా చాల గ్రంథాలు వచ్చాయి. ఆ గ్రంథాలలోని అంశాల జోలికి పోకుండా రాజ్యం గురించి దళితుల గురించి చెప్పిన వాటి 'సారం' తీసుకొని ఈ రెండింటినీ ఎదురుబొదురుగా నిలబెట్టినది ఈ పుస్తకం.
* * *
బొజ్జా తారకం వృత్తిరీత్యా సీనియర్ న్యాయవాది. కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే ఆయన హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ సహ వ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గదోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే బొజ్జా తారకం ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలన్ని వెచ్చిస్తున్నారు. భారత రిపబ్లికన్ పార్టీకీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడ పనిచేస్తున్నారు. మానవహక్కుల, పౌరహక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా అయనకు మంచి పేరుంది. బొజ్జా తారకం రచనల్లో "పోలీసులు అరెస్టు చేస్తే..." (1981), "కులం-వర్గం" (1996), "నది పుట్టిన గొంతుక" (1983) ప్రముఖమైనవి.
