-
-
దళిత జాతుల వైతాళికుడు అంబేడ్కర్
Dalitha Jaathula Vaithaalikudu Ambedkar
Publisher: Jayanthi Publications Vijayawada
Pages: 80Language: Telugu
మన సమాజంలో ప్రధానమైన సాంఘిక సమస్య పరిష్కారానికై అవిరళ కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాళి అంబేడ్కర్. అంబేడ్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక మహోద్యమం.
రాజకీయంగా, షెడ్యూలు జాతులను ఒక ప్రత్యేక శక్తిగా చేసింది అంబేడ్కర్. స్వతంత్ర చిత్తవృత్తితో, కార్యదీక్షతో అంబేడ్కర్ సాధించిన విజయాలు అసమాన్యమైనవి. చదువుల కేంద్రంగా, సాంఘిక సంస్కరణలకు ఆటపట్టుగా, ప్రతిభకు ఉనికిగా మసలిన మనిషి. ఆయన సాహిత్యవ్యాప్తి, భావప్రచారం సాంఘిక సంస్కరణాశక్తి మనకెంతగానో అవసరం. ఈ భావనతోనే ఈ రచనకు ఉపక్రమించాం. అంబేడ్కర్ సుసంపన్న వ్యక్తిత్వానికి - ఈ గ్రంథం నిలువుటద్దం పడితే మా ఆకాంక్ష తీరినట్టే.
డా. అంబేడ్కర్ జీవితాన్ని పఠనం చేయడం, అన్ని కోణాల నుంచి పరిశీలించడం అంత తేలికైన విషయం కాదు. గొప్పవారి జీవితాలు గ్రంథస్తం చేసే రచయితలు, జేగంటలు చేబూని స్తోత్రాలు చెయ్యడమో, తారులో ముంచిన కుంచెను చేబూని నిందలు గుప్పించడమో చేస్తారనే విమర్శ వుంది. ఇందుకు భిన్నంగా మా ప్రయత్నం సాగింది. నిర్ణయించవలసింది పాఠకులు, సహృదయులు.
- మండవ శ్రీరామమూర్తి
పోలు సత్యనారాయణ
