-
-
'దళిత' సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు! అంబేద్కరూ చాలడు! మార్క్స్ కావాలి!
Dalita Samasya Parishkaraniki Buddhudu Chaladu Ambedkaroo Chaladu Marx Kavali
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 344Language: Telugu
ఏది ఉన్నతమైన సిద్ధాంతం అయితే ప్రపంచానికి నిజంగా అదే కావాలి. ఏది వెలుగు బాటని పరచగలదో అదే కావాలి. ఆ సిద్ధాంతకర్త, బుద్ధుడా, మార్క్సా, అంబేద్కరా, మరొకరా అనేది అనవసరం. రోగాన్ని మాన్పగలిగేదే మందు! బాధల నుంచి ఏది విముక్తి ఇస్తుందో అదే ఉన్నత మార్గం! అది బౌద్ధ ధర్మమే, అయితే తప్పకుండా దాన్నే అనుసరించాలి! దాన్నే ఆరాధించాలి! కానీ అసలు తేల్చుకోవలసింది, 'ఏది ఉన్నత మార్గం' అని! మొదట తేలాల్సింది అదే! అలా తేలినదాన్ని తప్పకుండా అనుసరించవలసిందే!
ప్రపంచంలో ఎక్కడ ఏ 'గురువు'ని చూసినా, ఏ 'తత్వవేత్త'ని చూసినా, ఏ 'సిద్ధాంతాన్ని' చూసినా, అది, 'శ్రమ-సంబంధాల' గురించీ, 'ఆస్తి హక్కుల' గురించీ, 'కలిమి లేముల' గురించీ, ఏం చెపుతుందో చూడాలి. ఆ బోధన, సమాజంలో ఏ పక్షం వైపు నిలబడిందో గ్రహించాలి. అలా గ్రహించలేకపోతే, సమాజంలో ఏ విషయాన్నీ అర్థం చేసుకోలేము. మన 'ఆత్మరక్షణ' మనం చేసుకోలేము.
'గురువు' గానీ, 'నాయకుడు' గానీ, బోధించిన విషయాల్లో సరైన దాన్ని తీసుకుని సరి కాని దాన్ని తిరస్కరించాలి. తప్పుల్నీ ఒప్పుల్నీ ఒకే రకంగా భరించకూడదు. 'ప్రేమ' అయినా, 'భక్తి' అయినా, విచక్షణా రహితంగా వుండకూడదు.
