• Daivamto Naa Anubhavalu
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దైవంతో నా అనుభవాలు

    Daivamto Naa Anubhavalu

    Publisher: J.V.Publications

    Pages: 176
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ప్రపంచంలో స్థూలంగా రెండు రకాల వ్యక్తులను మనం గమనిస్తాం. ఒకటి దేవుణ్ణి నమ్మేవాళ్ళు, రెండు దేవుణ్ణి నమ్మనివాళ్ళు. అన్నీ భౌతిక సూత్రాల ప్రకారమే జరుగుతున్నాయంటారు భౌతికవాదులు. లేదు వీటన్నింటి వెనుక సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడు వున్నాడంటారు ఆస్తికులు. ఇందులో ఎవరి అభిప్రాయాలు వారివి!

ఈ విషయం మీద నేను ఎటువంటి వ్యాఖ్యానమూ చెయ్యదల్చుకోలేదు.

ఆస్తికులు.. అంటే భగవంతుని నమ్మేవాళ్ళలో చాలామంది రోజువారీ పూజాదికాలు నిర్వహించుకుంటూ, అవసరమైనప్పుడు గుళ్ళు, గోపురాలకు వెళ్తూ, కష్టం కలిగినప్పుడు భగవంతుణ్ణి ఆ కష్టం నుండి బైటపడేయమని వేడుకుంటూ.. ఇలా వుండటం చూస్తాం. ఇది సర్వసామాన్యంగా జరిగే పరిస్థితి. నేను కూడా దీనికి మినహాయింపు కాదు. కానీ అతి కొద్దిమంది ఆ భగవంతుడి ద్వారా కలలో, ఇలలో అనేకమైన అనుభవాలను పొందుతూ.. ఆ కారణంగా ఆశ్చర్యం, విభ్రమం, ఆనందంలాంటి అనేక భావోద్వేగాలను అనుభవిస్తూ.. నిరంతరం ఆ సర్వాంతర్యామి స్పర్శలో గడపడం అనేది ఒక అదృష్టం! అసలు ఇలాంటివి జరుగుతాయా? అన్న సందేహం ఒకప్పుడు నాక్కూడా కలుగుతూ వుండేది. కాలక్రమంలో ఆ సందేహాలన్నీ నాలో నుంచి పటాపంచలై ఎగిరిపోయాయి! కారణం.. అలాంటి అనుభవాలకు నేనే ప్రత్యక్ష సాక్షిగా నిలిచే పరిస్థితి రావడం..!

అవును.. ఇలాంటి ఎన్నో అనుభవాలకు, అనుభూతులకు ఈ రోజున నేను ప్రత్యక్షసాక్షిని! వాటిని మీతోపాటు పంచుకుందామనే నా ఆకాంక్షకు ఫలితమే ఇప్పుడు మీ చేతుల్లో వున్న ఈ పుస్తకం! ఇది భగవంతుని సంకల్పంతో నాకు ఎదురైన అనేక సంఘటనల సమాహారం! ఎన్నెన్నో అనుభూతుల, భావోద్వేగాల సమ్మిళితం!

- వెంకట వినోద్ పరిమి

Preview download free pdf of this Telugu book is available at Daivamto Naa Anubhavalu