-
-
'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డ్ గ్రహీతలు
Dada Saheb Phalke Award Graheetalu
Author: Lakshmana Rekha N. Gopalakrishna
Pages: 56Language: Telugu
భారతీయ చలనచిత్రపరిశ్రమకు పునాది రాయి వేసింది దాదా సాహెబ్ ఫాల్కే అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయన్ని 'ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని గౌరవిస్తున్నాం. ఆయన జీవితంపై ఈ మధ్య ఒక మరాఠీ ఫీచర్ ఫిలిం విడుదలైంది. అటువంటి మహానుభావుని గురించి తెలుసుకోవడం వంటి సినీ పరిశ్రమలోని ప్రతి వ్యక్తి, ప్రేక్షకుల విధి. కర్తవ్యం. ఆయన ఫోటో మనం ప్రతీ ఇంట్లోనూ పెట్టుకోవాలి. కష్ట నష్టాల కోర్చి, ఆయన అర్థాంగి తనలో సగభాగమై సహకరించిందని మనం తెలుసుకోవలసిన విషయం. తన నగలను తాకట్టుపెట్టి ధనాన్ని సహాయం చేయడం, యూనిట్ సభ్యులకు వంటలు వండి పెట్టడం ఆమె చేసిన సహాయం, సహకారం. అదే విధంగా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరి భార్య సహకరిస్తోందని, లేనిచో సినిమా పరిశ్రమలో ఏ వ్యక్తి పనిచేయలేరనీ, కష్టనష్టాల కోర్చి భర్తకు సహకరించడం ఒక త్యాగమేననీ, సినీ జీవులు గుర్తుంచుకోవాలి.
అటువంటి మహానుభావుని పేరిట కేంద్ర ప్రభుత్వం ఫాల్కే అవార్డును నెలకొల్పడం గొప్ప విషయం. ప్రతీ యేటా ఒక సినీ పరిశ్రమలోని వ్యక్తి ఈ అవార్డ్ నందుకుంటున్నారు. 1969లో మొదలయిన ఈ అవార్డులను అందుకున్న ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తే. అందుకే వారి గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని నేనీ ప్రయత్నం చేశాను. ఎక్కువ వివరాలు, వేల పేజీల్లో రాస్తే చదువరులకు ఓపికలేని రోజుల్లో, చిన్న పుస్తకంగానే మంచిదనే ఉద్దేశ్యంతో రాసిన పుస్తకం మీకు ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను.
- లక్ష్మణరేఖ గోపాలకృష్ణ

- ₹108
- ₹60
- ₹270
- ₹60
- ₹60
- ₹60